హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: పరీక్షలో కొడుకుకు స్లీప్‌లు ఇచ్చేందుకు వెళ్లిన తండ్రి. చితకబాదిన పోలీసులు! వీడియో

Viral Video: పరీక్షలో కొడుకుకు స్లీప్‌లు ఇచ్చేందుకు వెళ్లిన తండ్రి. చితకబాదిన పోలీసులు! వీడియో

కొడుతున్న పోలీసులు (Image credit Twitter/kirantajne)

కొడుతున్న పోలీసులు (Image credit Twitter/kirantajne)

కానీ మహారాష్ట్రలో ఓ తండ్రి మాత్రం అంతకుమించి చేశాడు. కొడుకు పరీక్ష పాస్ కావడానికి స్వయంగా ఓ తండ్రే(father) స్లిప్పులు అందించే ప్రయత్నం చేశాడు. ఫలితంగా పోలీసులతో కొట్టించుకున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎగ్జామ్‌(Exam)లో తమ పిల్లలకు మంచి మార్కులు రావాలని తల్లిదండ్రులు(parents) కోరుకోండం సాధారణ విషయమే! వాళ్లకు మంచి మార్కులు(marks) రావడం కోసం అన్ని సమకూర్చిపెడతారు కూడా. పిల్లల ఎగ్జామ్‌ను వాళ్ల సొంత ఎగ్జామ్‌లా ఫీల్ అవుతారు. చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే ఫీల్ అవుతారు.. ఎగ్జామ్‌లో బాగా రాయాలని.. చదివిన క్వశ్చన్సే రావాలని దేవుడిని కోరుకుంటారు. అయితే ఇదంతా ఓ కామన్‌ పేరంట్ చేసే పని.. కానీ మహారాష్ట్రలో ఓ తండ్రి మాత్రం అంతకుమించి చేశాడు. కొడుకు పరీక్ష పాస్ కావడానికి స్వయంగా ఓ తండ్రే(father) స్లిప్పులు అందించే ప్రయత్నం చేశాడు. ఫలితంగా పోలీసులతో కొట్టించుకున్నాడు.

మ్యాథమెటిక్స్ భయం:

ఒక తండ్రి తన పిల్లల పట్ల చూపే ప్రేమకు అవధులు ఉండవు. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. అయితే ఈ ప్రేమ కొన్నిసార్లు మనిషి చేయకూడని పనులు చేసేలా చేస్తుంది. మహారాష్ట్రలోని జల్గావ్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ తండ్రి తన కుమారుడి పరీక్ష హాలుకు వెళ్లి అతనికి చిట్టీలు అందించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్ర బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. అందులో మ్యాథమెటిక్స్ పేపర్ కావడంతో ఆ అబ్బాయికి ఫెయిల్ అవుతానని చాలా భయంగా ఉంది. దీంతో తండ్రి స్లీప్‌లతో రంగంలోకి దిగాడు. కొన్ని స్లిప్పులు పట్టుకుని పరీక్షా కేంద్రం దగ్గరికి వెళ్లాడు. తన కొడుకు ఏ గదిలో ఉన్నాడోనని వెతుకుతుండగా విధుల్లో ఉన్న పోలీసులు గమనించి హెచ్చరించారు. అక్కడి నుంచి దూరంగా పంపించారు.

మళ్లీ వచ్చాడు.. తన్నులు తిన్నాడు:

పోలీసులు ఎంత చెప్పినా ఆ తండ్రి మాట వినలేదు.. కాసేపటికి మరోమారు స్లీప్‌లు ఇచ్చేందుకు పరీక్ష కేంద్రం దగ్గరికి వెళ్లాడు. దీంతో పోలీసులు పట్టుకోవడంతో విడిపించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఒకటికి రెండుసార్లు చెప్పినా వినకపోవడంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. ఇద్దరు పోలీసు అధికారులు ఆ వ్యక్తిని తీవ్రంగా కొట్టడంతో అతను నేలపై పడిపోయాడు. కింద పడిన తర్వాత కూడా పోలీసులు కొట్టడం ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నమైన కామంట్లు చేస్తున్నారు. తండ్రిని కొట్టడంలో ఏ తప్పు లేదని కొంతమంది చెబుతుండగా.. మరికొంతమంది మాత్రం కాపీ కొట్టడం కంటే ఇలా కిందపడేసి కొట్టడమే తప్పు అంటున్నారు.

First published:

Tags: Maharastra