Home /News /trending /

MAHARASHTRA FARMER APPLIES FOR RS 6 CRORE BANK LOAN TO BUY HELICOPTER SAYS FARMING IS UNAFFORDABLE PAH

విసిగిపోయిన రైతు.. ఏకంగా హెలికాప్టర్ కొనడానికి బ్యాంక్ లో అప్లికేషన్.. కారణం ఏంటంటే..

విమానం కోసం రైతు దరఖాస్తు

విమానం కోసం రైతు దరఖాస్తు

Maharashtra: రైతుకు రెండెకరాల పోలం ఉంది. అతను దానిలో రెండేళ్ల నుంచి సోయాబీన్ ను సాగుచేస్తున్నాడు. అతనికి దిగుబడి సరిగ్గా మాత్రం రావడం లేదు.

రైతులు (Farmar) పగలనక రాత్రనక ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నారు. కానీ కొన్ని సార్లు వాతావరణం అనుకూలించక, వర్షం సరిగ్గా పడక వారి పంట చేతికి రాకుండా నష్టపోతున్నారు. బ్యాంకుల నుంచి, తెలిసిన వారి నుంచి ఎక్కువ వడ్డీలకు రుణాలు (loan) తీసుకుంటున్నారు. ఎలాగైన పంట (Crop) చేతికి వచ్చి తమ రుణం తీరుతుందని ఆశపడుతుంటారు. కానీ పంట చేతికి రాకపోవడంతో ఎంతో మంది రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు. తీసుకున్న అప్పులు తీర్చలేక, వడ్డీలుకట్టలేక.. ఇంట్లో వారిని ఇబ్బందులు పెట్టలేక ఎంతో మంది రైతులు తమ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. కేవలం పంటల మీద కాకుండా ప్రత్యామ్నాయంగా ఏంచేస్తే.. బాగా బతకొచ్చోదానిపై ఫోకస్ పెడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మహారాష్ట్రలో (maharashtra) ఒక వింత ఘటన జరిగింది. ఔరంగాబాద్ జిల్లాలోని హింగోలిలోని తక్టోబాకు చెందిన 22 ఏళ్ల కైలాస్ పతేంగే అనే రైతు రెండెళ్లుగా వ్యవసాయం చేస్తు విసిగిపోతున్నాడు. అతను తనకు ఉన్న రెండేకరాల పొలంలో.. సోయాబిన్ వేశాడు. కానీ ఎప్పుడు కూడా దిగుమతి రాలేదు. వర్షాలు లేక పంట మొత్తం పాడైంది. దీంతో అతను అప్పుల పాలయ్యాడు.



ఈ క్రమంలో విసిగిపోయాడు. ఇట్ల వర్కవుట్ కాదని అనుకున్నాడు. వెంటనే ఒక ప్లాన్ వేశాడు. డబ్బున్నోళ్లు మాత్రమే కలలు కనాలా... మేం కనకూడదా.. అనుకున్నాడు. ఇంతలో మనోడి బుర్రకి ఒక ఐడియా తట్టింది. తాను.. హెలికాప్టర్ కొంటే ఎలా ఉంటుందని అనుకున్నాడు. కొని దాన్ని అద్దెకు ఇచ్చి.. వచ్చిన డబ్బులతో హ్యాపీగా ఉంటానని అనుకున్నాడు. ఈ క్రమంలో.. తన గ్రామంలో ఉన్న(Maharashtra farmer applies for Rs 6 crore bank loan)  బ్యాంక్ కు వెళ్లాడు. తనకు 6.65 కోట్ల రుణం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రతీ వ్యాపారంలో పోటీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఎందుకు ఆలోచించ కూడదని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం రైతు ఐడియా నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Agriculture, Crops, Maharashtra, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు