హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

‘ముఖ్యమంత్రికి ముప్పు ఉంది.. ’.. కీలక విషయాలు వెల్లడించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్..

‘ముఖ్యమంత్రికి ముప్పు ఉంది.. ’.. కీలక విషయాలు వెల్లడించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్..

ఏక్ నాథ్ షిండే (ఫైల్)

ఏక్ నాథ్ షిండే (ఫైల్)

Maharashtra: ఇంటెలిజెన్స్ అధికారులకు సీఎంకు ఏక్ నాథ్ కు ముప్పు వాటిల్లనున్నట్లు సమాచారం అందింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

ఇంటెలిజెన్స్ అధికారులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. కొన్నిరోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు సీఎంచుట్టుపక్కల తిరుగుతున్నారని, ఎప్పుడైన దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. కాగా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేకు (Eknath Shinde)  ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులకు రిపోర్టు వచ్చింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే స్థానిక అధికారులను సమాచారం పంపించారు.

వెంటనే ఈ బెదిరింపులపై అధికారులు విచారణ చేపట్టిన అధికారులు దీన్ని వాస్తవమేనని అన్నారు. ప్రస్తుతం సీఎంకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. థానేలోని షిండే ప్రైవేట్ నివాసం, ముంబైలోని అధికారిక నివాసం 'వర్ష' వద్ద కూడా భద్రతను పెంచినట్లు అధికారి తెలిపారు. షిండే తన మొదటి దసరా ర్యాలీలో అక్టోబర్ 5న ముంబైలోని MMRDA గ్రౌండ్స్‌లో ప్రసంగించనున్నారు.

శివసేన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడంతో ఈ ఏడాది జూన్‌లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నక్సలిజం ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, సంరక్షక మంత్రిగా ఉన్నప్పుడు షిండేకు గత అక్టోబర్‌లో నక్సలైట్లు పంపినట్లు అనుమానిస్తున్న బెదిరింపు లేఖ వచ్చింది.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul gandhi) కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రను (Bharat jodo yatra)  చేపట్టారు.

ఈ నేపథ్యంలోనే ఆయన తమిళనాడులో తన పాదయాత్రను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కేరళలో పాదయాత్ర ముగించుకుని ఆతర్వాత.. కర్ణాటకలో ప్రస్తుతం యాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో..పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుంది. అనేక మంది ప్రజలు కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. అడుగడుగున ప్రజలు రాహుల్ గాంధీకి ఘన స్వాగతాలు పలుకుతున్నారు. అనేక మంది ఆయనతో పాటు కొద్ది దూరం వరకు పాదయాత్రలో నడుతుస్తున్నారు.

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అన్నివర్గాల వారుయాత్రలో జోష్ గా పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia gandhi) కూడా భారత్ జోడ్ యాత్రలో పాల్గొననుట్లు సమాచారం. కాగా, సోనియా గాంధీ.. దసరా తర్వాత.. అక్టోబరు 6 పాదయాత్రలో జాయిన్ అవుతున్నట్లు సమాచారం. మరుసటి రోజున ప్రియాంక గాంధీ, వాద్రా కూడా యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పాదయాత్ర ప్రారంభమైనప్పుడు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ మాండ్య జిల్లా నుంచి తొలిసారిగా చేరనున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Eknath Shinde, Maharashtra, VIRAL NEWS

ఉత్తమ కథలు