MAHARASHTRA BJP LEADER ATTACKED BY NCP WORKERS OVER SOCIAL MEDIA POST AGAINST SHARAD PAWAR PVN
Viral Video : శరద్ పవార్ పై పోస్ట్..బీజేపీ నేత చెంప పగలకొట్టిన ఎన్సీపీ కార్యకర్తలు
బీజేపీ నేత వినాయక్ అంబేద్కర్ పై ఎన్సీపీ నేతల దాడి
BJP leader attacked by NCP workers: మహారాష్ట్రకు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేద్కర్...రెండు రోజుల క్రితం ఎన్సీపీ చీప్ శరద్ పవార్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
BJP leader attacked by NCP workers: మహారాష్ట్రకు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేద్కర్...రెండు రోజుల క్రితం ఎన్సీపీ చీప్ శరద్ పవార్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై ఎన్సీపీ నేతలు,కార్యకర్తల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తమయింది. పోస్ట్ పెట్టిన బీజేపీ నేత వినాయక్ అంబేద్కర్ పై సోషల్ మీడియా వేదికగానే మాటల దాడి చేశారు. అయితే అంతటితో శాంతించని ఎన్పీసీ కార్యకర్తలు ఆదివారం పూణేలోని వినాయక్ అంబేద్కర్ కార్యాలయానికి వెళ్లిన కొందరు ఎన్సీపీ కార్యకర్తలు...శరద్ పవార్ కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడంపై ఆయనను నిలదీశారు. దీంతో వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన ఒక ఎన్సీపీ కార్యకర్త బీజేపీ నేత వినాయక్ చెంప చెళ్లుమనిపించాడు.
మరోవైపు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ పై ఎన్సీపీ గూండాలు దాడి చేశారని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ ఆరోపించారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దాడి చేసిన ఎన్సీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక,ఈ ఘటనపై వినాయక్ అంబేద్కర్ పూణే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కార్యాలయంలో 20 మంది ఎన్సీపీ కార్యకర్తలు తనను కొట్టారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోషల్ మీడియా పోస్ట్‌పై క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ ఎంపీ గిరీష్ బాపట్ కోరారని ఆరోపించారు. " ట్యాక్స్ విషయం గురించి సలహా కావాలి అంటూ ఈ రోజు నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి 20 మందితో కలిసి నా ఆఫీసుకు వచ్చి నన్ను చెప్పుతో కొట్టాడు. నా కళ్లద్దాలు పగిలిపోయాయి. ఈ విషయం గురించి నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను"అని వినాయక్ అంబేద్కర్ తెలిపారు.
महाराष्ट्र प्रदेश भारतीय जनता पार्टीचे प्रवक्ते प्रा. विनायक आंबेकर यांच्या वर राष्ट्रवादीच्या गुंडांनी भ्याड हल्ला केला असून, भाजपाच्या वतीने मी या हल्ल्याचा तीव्र शब्दांत निषेध व्यक्त करतो. राष्ट्रवादीच्या या गुंडांवर तात्काळ कारवाई झालीच पाहिजे !@BJP4Maharashtrapic.twitter.com/qR7lNc1IEN
మరోవైపు, అధినేత శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేశారన్న కారణంతో.. మరాఠీ నటి కేతకి చితాలే(26)ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై ఏకంగా మూడు కేసులు నమోదు చేశారు. పవార్ అనే పేరును ప్రస్తావిస్తూ.."నరకం వేచిచూస్తోంది. బ్రాహ్మణులను మీరు అసహ్యించుకుంటారు" అంటూ కేతకి ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. వీటిపై పలు ఫిర్యాదులు అందుకున్న థానే పోలీసులు... ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపర్చగా మే 18 వరకు పోలీస్ కస్టడీ విధించింది. ఇదే కేసులో నిఖిల్ అనే విద్యార్థిని శనివారం నాసిక్ లో అరెస్ట్ చేశారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.