కలెక్టర్ చాలా స్ట్రిక్ట్ గురూ.. తనకు తానే ఫైన్ వేసుకున్నాడుగా...

బీడ్ జిల్లా కలెక్టర్ అస్తీక్ కుమార్ పాండే ప్లాస్టిక్ కప్పు వినియోగించారు. అయితే, రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధించి.. ప్లాస్టిక్ కప్పులో టీ ఎలా ఇస్తారంటూ ఓ జర్నలిస్ట్ కలెక్టర్‌ను ప్రశ్నించారు.

news18-telugu
Updated: October 10, 2019, 7:57 PM IST
కలెక్టర్ చాలా స్ట్రిక్ట్ గురూ.. తనకు తానే ఫైన్ వేసుకున్నాడుగా...
యూపీఎస్సీ బోర్డు
  • Share this:
మహారాష్ట్రలో ఓ కలెక్టర్ తనకు తానే రూ.5వేలు జరిమానా విధించుకున్నారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా వాస్తవం. బీడ్ జిల్లా కలెక్టర్ అస్తీక్ కుమార్ పాండే ప్లాస్టిక్ కప్పు వినియోగించారు. అయితే, రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధించి.. ప్లాస్టిక్ కప్పులో టీ ఎలా ఇస్తారంటూ ఓ జర్నలిస్ట్ కలెక్టర్‌ను ప్రశ్నించారు. దీంతో వెంటనే కలెక్టర్ తనకు తాను రూ.5000 జరిమానా విధించుకున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బీడ్ జిల్లాకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు? అందులో ఎంతమంది ఉపసంహరించుకున్నారనే వివరాలను తెలియజేసేందుకు జిల్లా అధికారులు ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు సింగల్ యూజ్ ప్లాస్టిక్ కప్పులో అటెండర్లు టీ ఇచ్చారు. అయితే, మహారాష్ట్రలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉంది. కానీ, స్వయంగా జిల్లా కలెక్టరేట్‌లోనే ఆ నిషేధం అమలు కావడం లేదని, మీరేఎలా ప్లాస్టిక్‌ను వినియోగిస్తారంటూ ఓ జర్నలిస్ట్.. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అస్తీక్ కుమార్ పాండే దృష్టికి తెచ్చారు. దీంతో అటెండర్ చేసిన తప్పుకి తాను బాధ్యత వహిస్తూ తనకు తాను రూ.5వేలు జరిమానా విధించుకున్నారు.

ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అందరు అధికారులను పిలిచి కలెక్టర్ క్లాస్ పీకారు. అందరికీ నిబంధనలు పాటించాలని చెప్పే అధికారులే రూల్స్ పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీంతోపాటు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా ఇలాంటి సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకుండా చూడాలని ఆదేశించారు.

Video: పాముని నూడుల్స్‌గా మింగేసిన కప్పFirst published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు