అఖండ భారత్‌‌ను నిర్మించాలి.. మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పాక్‌లో బ్యానర్లు..

Maha Bharat: పాకిస్తాన్‌లోని కొందరు వ్యక్తులు మాత్రం మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. భారత్‌కు మద్దతుగా తమ అభిప్రాయాలను బ్యానర్లపై ముద్రించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 7, 2019, 5:00 PM IST
అఖండ భారత్‌‌ను నిర్మించాలి.. మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పాక్‌లో బ్యానర్లు..
ఇస్లామాబాద్ వీధుల్లో వెలిసిన బ్యానర్
  • Share this:
జమ్మూకశ్మీర్‌కు కల్పించిన స్వయం ప్రతిపత్తి అధికారాల ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాని విభజించడమే కాకుండా, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేసింది. అందుకు లోక్‌సభ, రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ, పాకిస్తాన్‌లోని కొందరు వ్యక్తులు మాత్రం మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. భారత్‌కు మద్దతుగా తమ అభిప్రాయాలను బ్యానర్లపై ముద్రించారు. ‘మహా భారత్‌కు ముందడుగు’ అంటూ.. శివసేన ఎంపీ వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్‌ను ముద్రించి వాటిని ఇస్లామాబాద్ వీధుల్లో ఏర్పాటు చేశారు. ఆక్రమిత కశ్మీర్ తర్వాత భారత్ బలూచిస్తాన్, ఆజాద్ కశ్మీర్‌ను పాక్ నుంచి తీసేసుకుంటుందని అందులో రాశారు.

ఈ బ్యానర్లు ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఘటనపై వివరాలు తెలుసుకున్న పోలీసులు బ్యానర్లన్నింటినీ తొలగించారు. స్థానిక సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వాటిని ఏర్పాటు చేసిన వ్యక్తులను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా, భారత్‌లో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో పాక్ జాతీయులు మోదీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading