Video: కుండలో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి కథ గుర్తుందా? ఇప్పుడు రియల్‌గా చూడండి

ఇక్కడ కుండలో కాదు. ఓ వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగడానికి కుదరకపోవడతో అందులో రాళ్లు వేసి నీళ్లు పైకి తీసుకొచ్చి ఆ తర్వాత తాగింది.

news18-telugu
Updated: November 17, 2020, 5:34 PM IST
Video: కుండలో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి కథ గుర్తుందా? ఇప్పుడు రియల్‌గా చూడండి
వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగుతున్న మ్యాగ్పీ
  • Share this:
మీ చిన్నప్పుడు అమ్మనాన్నలు, అమ్మమ్మ నానమ్మలు లేకపోతే స్కూల్లో టీచర్లు, స్నేహితులు ఎవరి దగ్గరైనా కావొచ్చు, ఓ కథ విని ఉంటారు. అనగనగా ఓ రోజు ఓ కాకికి బాగా దాహం వేసింది. దానికి తాగడానికి నీళ్లు ఎక్కడా దొరకలేదు. చివరకు ఓ కుండలో అడుగున కొన్ని నీళ్లు కనిపిచాయి. అయితే, దానికి తాగడం కుదరలేదు. అది ఓ ఉపాయం వేసింది. చిన్న చిన్న గులకరాళ్లు తీసుకొచ్చి ఆ కుండలో వేసింది. అలా అలా కుండలో నీళ్లు పైకి వచ్చాయి. అప్పుడు ఎచక్కా నీళ్లు తాగి దా తీర్చుకుంది. ఇది నిజంగా కథే. అదరూ వినే ఉంటారు. అయితే, అలాంటి కాకి ఎక్కడైనా ఉంటుందా? అని మీకు అనుమానం రావొచ్చు. మీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. ఎందుకంటే అలాటి కాకిని మీకు చూపించబోతున్నాం. అయితే, ఇక్కడ కుండలో కాదు. ఓ వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగడానికి కుదరకపోవడతో అందులో రాళ్లు వేసి నీళ్లు పైకి తీసుకొచ్చి ఆ తర్వాత తాగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే, ఇది కాకి కాదు. అలాగే ఉండే మ్యాగ్పీ అనే పక్షి. మ్యాగ్పీ అలా నీళ్లు తాగుతున్న వీడియోను స్టీవ్ స్టీవార్ట్ విలియమ్స్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాకుల్లాగే ఈ మ్యాగ్పీలు కూడా తెలివైనవని ఆయన తెలిపారు.



ఫైరింజన్‌లా కూతపెడుతున్న మ్యాగ్పీ
ఈ మ్యాగ్పీ పక్షి గురించి కొన్ని రోజుల క్రితం మరో వైరల్ వీడియో బయటకు వచ్చింది. ఆస్ట్రేలియాలో మాగ్పీ పక్షి... ఫైర్ ఇంజిన్ సైరన్‌ను కాపీ కొట్టేస్తోంది. దాదాపు 90 శాతం ఫైర్ ఇంజిన్ లాగే కూత పెడుతూ... అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎంతలా అంటే... ఆస్ట్రేలియాలో వచ్చిన కార్చిచ్చులా. కొంత మంది ఈ పక్షి భలే కూత పెడుతోందే అంటుంటే మరికొంత మంది అది కూత కాదు... హెచ్చరిక అంటున్నారు. ఏంటంటే... ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కార్చిచ్చు... అడవుల్నీ, రోడ్లనూ, ఇళ్లనూ దహించేస్తోంది. ఇప్పటికే 18 మంది చనిపోయారు. అందువల్ల ఈ కార్చిచ్చుపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. అది త్వరగా ఆరిపోతే బాగుండని అనుకుంటున్నాయి. ఐతే... ఇప్పుడు కార్చిచ్చును ఆర్పేందుకు పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు... ఆస్ట్రేలియాలో పరుగులు పెడుతున్నాయి. అవి చేస్తున్న సైరన్‌లను ఈ మాగ్పీ పక్షి వినీ వినీ... చివరకు తన ఒరిజినల్ కూత మర్చిపోయి... ఫైరింజిన్ కూత దానికి వచ్చేసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 17, 2020, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading