Home /News /trending /

MAGNETAR SUN ERUPTION STAR EXPLOSION SPACE STATION SUN SOLAR GH VB

Magnetars Flares: అది ఎంత శక్తివంతమైనదంటే.. సూర్యుని శక్తి ఏ మాత్రం సరిపోదు.. తాజా పరిశోధనలో కీలక విషయాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మన గెలాక్సీలో మొత్తం 30 వరకు మాత్రమే మాగ్నటార్స్ ఉన్నాయి. వాటి స్వభావం గురించి శాస్త్రవేత్తలకు చాలా తక్కువ విషయాలు మాత్రమే తెలుసు. అయితే వారి నుంచి వెలువడే శక్తి సూర్యుడి నుంచి వెలువడే సౌర మంటల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.

సూర్యుడి కంటే కొన్ని నక్షత్రాలు చాలా పెద్దగా ఉంటాయనే విషయం తెలిసిందే. 10 నుంచి 25 సూర్యుల పరిమాణంలో ఉండే సూపర్‌మాసివ్ నక్షత్రాలు గురుత్వాకర్షణ శక్తి కోల్పోయిన తరువాత మృత నక్షత్రాలు (న్యూట్రాన్ స్టార్స్‌)గా మారతాయి. ఈ న్యూట్రాన్ స్టార్స్‌లో అత్యంత తీవ్రమైన అయస్కాంత క్షేత్రంతో ఒక చిన్న సమూహం ఏర్పడుతుంది. దీన్ని మాగ్నెటార్స్ అంటారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నాయి. తాజాగా వీటిపై చేపట్టిన పరిశోధనల్లో కొత్త అంశాలకు కనుగొన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. 13 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక మాగ్నటార్ నుంచి 3.5 మిల్లీసెకన్ల పాటు ఉద్భవించిన, అత్యంత అరుదైన భారీ విస్ఫోటనాలకు సంబంధించిన ఆధారాలను అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం పొందింది. GRB2001415 అనే మాగ్నటార్ ఫ్లేర్ విడుదల చేసిన ఈ శక్తి.. సూర్యుడు లక్ష సంవత్సరాల పాటు విడుదల చేసిన శక్తికి సమానమని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు.

స్పెయిన్‌లోని అండలూసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IAA-CSIC) ప్రొఫెసర్ అల్బెర్టో జె.కాస్ట్రో-టిరాడో నేతృత్వంలో ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. వివిధ డోలనాలను లేదా అత్యధిక శక్తిని వెలువరించే సమయంలో పల్స్ కొలవడానికి విస్ఫోటనాన్ని వారు అధ్యయనం చేశారు. జెయింట్ మాగ్నెటార్ ఫ్లేర్స్‌ను అర్థం చేసుకోవడంలో ఇది కీలకమైన భాగమని పేర్కొన్నారు. మొదటిసారి ఎక్స్‌ట్రా గలాక్టిక్ మాగ్నెటార్‌పై నిర్వహించిన ఈ అధ్యయనం నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఉత్తరాఖండ్‌లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్‌ సంస్థకు చెందిన డాక్టర్ శశి భూషణ్ పాండే కూడా ఈ బృందంలో ఉన్నారు.

Explained: VPN టూల్ ఎంతవరకు సేఫ్‌..? దీన్ని ట్రాకింగ్, హ్యాకింగ్ చేయవచ్చా..?పూర్తి సమాచారం ఇలా..


మన గెలాక్సీలో మొత్తం 30 వరకు మాత్రమే మాగ్నటార్స్ ఉన్నాయి. వాటి స్వభావం గురించి శాస్త్రవేత్తలకు చాలా తక్కువ విషయాలు మాత్రమే తెలుసు. అయితే వారి నుంచి వెలువడే శక్తి సూర్యుడి నుంచి వెలువడే సౌర మంటల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ‘క్రియారహిత స్థితిలో కూడా ఈ మాగ్నటార్స్ సూర్యుని కంటే అనేక వేల రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. GRB2001415 మాగ్నటార్‌ నుంచి 2020 ఏప్రిల్ 15న సంభవించిన ఫ్లాష్ సెకనులో పదోవంతు మాత్రమే కొనసాగింది. దీని నుంచి విడుదలైన శక్తి.. 1,00,000 సంవత్సరాలలో మన సూర్యుడు ప్రసరించే శక్తికి సమానం. ఈ అబ్జర్వేషన్స్‌లో మల్టిపుల్ పల్సెస్‌ను పరిశీలించాం. మొదటి పల్స్ మైక్రోసెకన్‌లో పదో వంతు మాత్రమే కనిపించింది’ అని ప్రధాన రచయిత అల్బెర్టో జె. కాస్ట్రో-టిరాడో చెప్పారు.

New Year Big Shock: కొత్త ఏడాదిలో వాహనదారులకు బిగ్ షాక్​.. అదేంటో తప్పక తెలుసుకోండి..


మాగ్నెటార్ నుంచి వెలువడిన ఈ భారీ విస్ఫోటనం.. వాటి అయస్కాంత గోళంలో అస్థిరత కారణంగా లేదా వాటి క్రస్ట్‌లో ఏర్పడ్డ ఒక రకమైన భూకంపం కారణంగా సంభవించి ఉండవచ్చు. ఈ విస్పోటనం ఒక కిలోమీటరు మందంతో దృఢమైన, సాగే పొరలా ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నక్షత్రం మాగ్నెటోస్పియర్‌లో ఒక రకమైన తరంగాలు ఏర్పడతాయి. సూర్యుడిపై ఏర్పడే ఇలాంటి తరంగాలను ఆల్ఫ్వెన్ తరంగాలు అంటారు. ఇవి సోర్స్ పాయింట్స్ నుంచి ముందుకు వెనుకకు బౌన్స్ అవుతున్నప్పుడు అయస్కాంత క్షేత్రంలో ఒకదానికొకటి శక్తిని వెదజల్లుతూ సంకర్షణ చెందుతాయి’ అని కాస్ట్రో-టిరాడో పేర్కొన్నాడు.

New Work Structure: వర్క్ ఫ్రమ్ హోమ్ పై ప్రభుత్వం తీసుకురానున్న నిబంధనలు ఇవే.. వివరాలిలా.. 


ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోని అట్మాస్పియర్-స్పేస్ ఇంటరాక్షన్స్ మానిటర్ (ASIM) ఇన్‌స్ట్రుమెంట్ ఈ విస్ఫోటనాన్ని కనుగొంది. ఒక సంవత్సరం పాటు డేటా మినిట్ స్కేల్‌ను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు తాజా ఫలితాలను వెల్లడించారు. ఇలాంటి ఫ్లేర్స్‌ను మన గెలాక్సీ, పాలపుంతలో కనుగొన్న మొత్తం 30 మాగ్నటార్లలో రెండింటిలో కనుగొన్నారు. ఇతర గెలాక్సీలలో ఉన్న మరో రెండింటిలో సైతం ఫ్లేర్స్ కనుగొన్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Science, Trending, Trending news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు