Home /News /trending /

MAGICIAN PERFORMS 20 MAGIC TRICKS UNDERWATER IN 3 MINUTES SETS GUINNESS WORLD RECORD NK

Magic Tricks: నీటిలో మ్యాజిక్... 3 నిమిషాల్లో 20 ట్రిక్స్... గిన్నీస్ రికార్డ్... వైరల్ వీడియో

నీటిలో మ్యాజిక్. 3 నిమిషాల్లో 20 ట్రిక్స్ (credit - facebook)

నీటిలో మ్యాజిక్. 3 నిమిషాల్లో 20 ట్రిక్స్ (credit - facebook)

Magic Tricks: మ్యాజిక్ చెయ్యడం అనేది మనం కళ్లతో చూసినంత తేలిక కాదు. ఎలా చేశారో కూడా మనం కనిపెట్టలేని విధంగా ఉంటుంది. మరి అతను నీటిలో 3 నిమిషాల్లో 20 ట్రిక్స్ ఎలా చేశాడు?

    ఈ రోజుల్లో గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే... ఏ రికార్డ్ నెలకొల్పుదామన్నా... ఆల్రెడీ దాన్ని చాలా మంది నెలకొల్పి తమ పేరున రికార్డును ఉంచుకుంటున్నారు. కొత్తగా ఎవరైనా రికార్డు సాధించాలంటే... ఆల్రెడీ ఉన్న రికార్డును మించి పెర్ఫామెన్స్ ఇవ్వాలి. అలాంటిది... ఇంద్రజాలికుడు (Magician) మార్టిన్ రీస్ మాత్రం... పాత రికార్డును బేక్ చేసి... సరికొత్త గిన్నీస్ రికార్డ్ సృష్టించాడు. జస్ట్ 3 నిమిషాల్లో అతను 20 రకాల మ్యాజిక్ ట్రిక్స్ చేశాడు. అది కూడా నీటిలో ఉంటూ. ఇంగ్లండ్... హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కి చెందిన మార్టిన్... ఓ అద్దాల పూల్‌లో దిగాడు. అక్కడ నీటి లోపల స్టేజ్ లాంటిది ఉంది. ఐవెర్ హీత్‌లోని పైన్‌వుడ్ స్టూడియోస్‌లో ఆ పూల్ ఉంది.

    ఎప్పుడో 10 ఏళ్ల కిందట సెవెన్ ట్రిక్స్ అనే ఇంద్రజాలికుడు... ఇలాంటి రికార్డును తన పేరున రాసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మార్టిన్.. ఆ రికార్డును బ్రేక్ చేసి.. కొత్త వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఇక్కడో విషయం మనం తెలుసుకోవాలి. మార్టిన్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు... వరదల్లో చిక్కుకున్నాడు. దాదాపు చావు అంచులదాకా వెళ్లాడు. దాంతో... అతనికి నీరు అంటే భయం ఏర్పడింది. నీటిలో దిగాలంటే భయపడేవాడు. తనలో భయం పోవాలని బలంగా డిసైడయ్యాడు. అందుకే... అదే నీటిలో తాను రికార్డు సృష్టించాలని అనుకున్నాడు. తనలో భయం పోగొట్టుకోవడమే కాకుండా... ప్రపంచ గుర్తింపూ సంపాదించుకున్నాడు.

    మార్టిన్ ఈ రికార్డు సాధించడానికి మరో విషయం కూడా ప్రేరణగా నిలిచింది. రవితేజ నటించిన కిక్ సినిమాలో లాగా... ఆస్పత్రులలో అనారోగ్యంతో ఉండే పిల్లలకు మార్టిన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. తద్వారా వాళ్లు నవ్వితే వచ్చే ఆనందాన్ని అనుభూతి చెందాడు. అందుకే... వాళ్లలో ఆనందాన్ని చూడాలనే ప్రేరణతో... ఈ ప్రయత్నం చేశాడు. ఈ రికార్డును పిల్లలకు, వాళ్ల తల్లిదండ్రులకూ అంకితం చేశాడు. కరోనా కాలంలో... మార్టిన్ ఆస్పత్రులకు వెళ్లలేకపోయాడు. ఆన్‌లైన్ వర్చువల్ విధానాల్లో మ్యాజిక్ చేసి నవ్వించాడు.

    గాలిలో మ్యాజిక్ చేయడానికీ, వాటర్‌లో చేయడానికీ చాలా తేడా ఉంటుంది. గాలిలో వస్తువులు చకచకా కదలగలవు. నీటిలో నెమ్మదిస్తాయి. అలాంటప్పుడు మ్యాజిక్ పనిచేయకపోవచ్చు. ఈ సవాళ్లను మార్టిన్ ఎదుర్కొని విజేతగా నిలిచాడు.



    ఇది కూడా చదవండి: False Rape Case: తప్పుడు రేప్ కేసు పెట్టిన యువతి... షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు

    ఇది మార్టి్న్ 5వ గిన్నీస్ రికార్డు. ఇదివరకు ఒక్క నిమిషంలో 18 కార్డులను గుర్తించాడు. ఒకే స్కైడైవ్‌లో 11 మ్యాజిక్ ట్రిక్స్ చేశాడు, కళ్లు మూసుకోని... నిమిషంలో 24 మ్యాజిక్స్ చేశాడు, విండ్ టన్నెల్‌లో 3 నిమిషాల్లో 8 మ్యాజిక్ ట్రిక్స్ చేశాడు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: VIRAL NEWS, Viral Videos

    తదుపరి వార్తలు