భార్య మృతిని తట్టకుకోలేని వ్యాపారి.. నెల రోజుల్లోనే..

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా బాటలోనే ప్రయాణించాడు మరో వ్యక్తి. విగ్రహం ఏర్పాటు ద్వారా తన భార్యపై ప్రేమను చాటుకున్నాడు.

news18-telugu
Updated: September 11, 2020, 5:15 PM IST
భార్య మృతిని తట్టకుకోలేని వ్యాపారి.. నెల రోజుల్లోనే..
భార్య విగ్రహంతో సేతురామన్
  • Share this:
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా  రోడ్డు ప్రమాదంలో మరణించిన తన భార్య ఎప్పటికి గుర్తుండి పోయేలా ఆమె మైనపు విగ్రహాన్ని తయారు చేయించిన సంగతి తెలిసిందే.  ఈ విధంగా తన భార్యపై ప్రేమను చాటుకున్నాడు శ్రీనివాస్. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి అదే బాటలో పయణించాడు.  భార్య మరణించి నెల రోజులు కాకముందే.. ఇంట్లో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది.

వివరాలు.. మధురైకి చెందిన వ్యాపారి సేతురామన్(74), అతని భార్య పిచైమణి(67).. చాలా కాలంగా ఆనందంగా దాంపత్య జీవనం సాగించారు. అయితే ఆగస్టు నెలలో పిచైమణి గుండెపోటుతో మృతి చెందింది. దీంతో ఇంతకాలం తనతో కలిసి జీవినం సాగించిన భార్య మరణించే సరికి సేతురామన్ కుంగిపోయాడు. అయితే ఆమెను లేని లోటును భరించలేకపోయిన సేతురామన్.. నెల రోజులు తిరగకముందే ఇంట్లో భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఆమె ఆకుపచ్చ చీరలో కుర్చీలో కుర్చున్నట్టుగా ఆ విగ్రహాన్ని తయారు చేయించాడు.

ఇందుకు సంబంధించి సేతురామన్ మాట్లాడుతూ.. "నేను ఇటీవలే నా భార్యను కోల్పోయాను. కానీ ఈ విగ్రహం ద్వారా ఆమె నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. 48 ఏళ్ల తమ దాంపత్య జీవితంలో కనీసం ఒక్క రోజు నా భార్యను విడిచి ఉండలేదు. నేను నా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాను. ఈ ప్రయాణం పలుమార్లు నష్టాలు ఎదురయ్యాయి. కానీ ఆమె ఎప్పుడు నా వెంట ఉంది. ఆమె నాకు మంచి స్నేహితురాలు" అని తెలిపారు. ఇక, విల్లుపురానికి చెందిన ప్రసన్న అనే శిల్పి కేవలం నెల రోజుల వ్యవధిలో ఈ విగ్రహాన్ని తయారు చేశాడు.
Published by: Sumanth Kanukuka
First published: September 11, 2020, 5:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading