• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • MADURAI COUPLE PRINTS QR CODE ON WEDDING INVITE FOR GUESTS TO TRANSFER GIFT CASH TO BANK ACCOUNT DETAILS HERE MS GH

QR Code For Wedding Gifts: పెళ్లి పత్రికపై క్యూఆర్ కోడ్.. చదివింపుల కోసం వినూత్న ఆలోచన

QR Code For Wedding Gifts: పెళ్లి పత్రికపై క్యూఆర్ కోడ్.. చదివింపుల కోసం వినూత్న ఆలోచన

ప్రతీకాత్మక చిత్రం

QR Code For Wedding Gifts: గూగుల్ పే, ఫోన్‌పే వంటి పేమెంట్ యాప్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర సదుపాయాలను ఉపయోగించి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం మనకు తెలిసిందే. తాజాగా QR కోడ్ ఆలోచనతో పెళ్లి చదివింపుల ప్రక్రియను సులభతరం చేసింది ఒక జంట.

  • News18
  • Last Updated:
  • Share this:
టెక్నాలజీ ద్వారా పనులను సులభంగా పూర్తి చేసుకునే అవకాశం ప్రజలకు దక్కింది. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత క్షణాల్లోనే బ్యాంకు లావాదేవీలు చేసుకునే వీలు కలిగింది. గూగుల్ పే, ఫోన్‌పే వంటి పేమెంట్ యాప్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర సదుపాయాలను ఉపయోగించి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం మనకు తెలిసిందే. తాజాగా QR కోడ్ ఆలోచనతో పెళ్లి చదివింపుల ప్రక్రియను సులభతరం చేసింది ఒక జంట. తమిళనాడులోని మదురైలో జరిగిన పెళ్లి కోసం వధూవరులు వినూత్నంగా ఆలోచించారు. వెడ్డింగ్ కార్డుపై గూగుల్ పే, ఫోన్ పే QR కోడ్‌లను ముద్రించి ఆహ్వానితులకు అందించారు. పెళ్లికి వచ్చేవారు, ఇతర కారణాలతో రాలేకపోయినవారు ఇన్విటేషన్ కార్డుపై ఉన్న క్యూ ఆర్ కోడ్ ద్వారా వధూవరుల అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని చెప్పారు. ఈ వినూత్న ఆలోచన ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఇప్పటి వరకు సుమారు 30 మంది వ్యక్తులు QR కోడ్ ద్వారా పెళ్లి చదివింపుల కింద డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశారని పెళ్లికూతురు తల్లి టి.జె.జయంతి చెప్పారు. ఆమె మదురైలో బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. తమ కుటుంబంలో ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి అని ఆమె తెలిపారు. ఈ పెళ్లి ఆదివారం జరిగింది. వీరి వినూత్న ఆహ్వాన పత్రిక, క్యూఆర్ కోడ్ చదివింపుల ప్రక్రియ గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు.

కరోనా తరువాత కొత్త ఆలోచనలు
కరోనా తరువాత పెళ్లి, ఇతర ఫంక్షలను ఆన్‌లైన్ టెక్నాలజీ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం ట్రెండింగ్‌గా మారింది. ఇలాంటి ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత నెలలో పెళ్లి చేసుకున్న ఒక జంట కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు. వారి బంధువులు, స్నేహితుల ఇళ్లకే పెళ్లి విందు భోజనాన్ని పంపించారు. తాజాగా క్యూఆర్ కోడ్ చదివింపుల గురించి తనకు చాలా కాల్స్ వస్తున్నాయని జయంతి చెప్పారు. తన సోదరుడికి, ఇతర కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం నుంచి చాలామంది ఫోన్ చేసి ఆరాతీస్తున్నారని వివరించారు.

వైరల్ అవుతున్నాయి
ఇలాంటి వర్చువల్ వెడ్డింగ్స్ ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ వైరల్ అవుతున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా బంధుమిత్రులు లేకుండానే పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక జంట వినూత్నంగా ఆలోచించింది. అమీ సిమోన్సన్, డాన్ స్టుగ్లిక్ అనే ఇద్దరు ఇటీవల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వైరస్ భయంతో వారు నివాసం ఉంటున్న మిచిగాన్‌లో వివాహ వేడుకలకు అనుమతి రాలేదు. దీంతో ఒక ప్యాకేజింగ్ సంస్థ మనుషుల రూపంలో ఉన్న 100కి పైగా కార్డ్‌బోర్డ్ కటౌట్లను వీరి పెళ్లికి విరాళంగా ఇచ్చింది. ఒంటరిగా పెళ్లి చేసుకున్నామనే భావన లేకుండా, బంధుమిత్రుల స్థానంలో ఈ కటౌట్లను పెట్టారు. కొలొమా (Coloma) ప్రాంతంలోని మెనాషా ప్యాకేజింగ్ కంపెనీ ఈ ఆలోచనతో వార్తల్లో నిలిచింది.

యువతీ యువకులు, ముసలివాళ్లు, పిల్లలు, పెద్దల కటౌట్ల మధ్య సిమెన్సన్, స్టుగ్లిక్ పెళ్లి చేసుకున్నారు. స్టుగ్లిక్ కొలొమా టౌన్‌షిప్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తనకు కాబోయే భార్య కోసం ప్రత్యేకంగా, జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నాడు. మేనాషా ప్యాకేజింగ్ కంపెనీ సాయంతో ఆర్టిఫిషియల్ గెస్ట్‌ల ఆలోచన చేశాడు. చర్చిలో ఖాళీ కుర్చీల మధ్య పెళ్లి చేసుకోకుండా, వినూత్న అతిథుల ఆధ్వర్యంలో ఇద్దరం ఒకటి కావడం మంచి అనుభూతిని మిగిల్చిందని అతడు వివరించాడు.
Published by:Srinivas Munigala
First published: