Marriage In Flight: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. విమానంలో పెళ్లి చేసుకున్న జంట.. అతిథుల సమక్షంలోనే.. Viral Video

విమానంలో పెళ్లి చేసుకున్న జంట(Pic- Twitter)

లాక్‌డౌన్ సమయంలో తమ పెళ్లిని వాయిదా వేసుకోకుండా.. సన్నిహితుల సమక్షంలో వేడుకను జరుపుకోవడానికి ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. లాక్‌డౌన్ నిబంధనలను తప్పించుకోవడానికి.. విమానంలో పెళ్లి చేసుకుంది.

  • Share this:
    పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఘట్టం. అందుకే చాలా మంది తమ పెళ్లి వేడుకను మరిచిపోలేని జ్ఞాపకంగా నిలుపుకోవాలని అనుకుంటారు. ఇందుకు తగ్గట్టు ప్లానింగ్స్ కూడా చేస్తారు. అయితే కరోనా వల్ల చాలా వరకు పరిస్థితులు తలకిందులయ్యాయి. కొందరు పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం నిబంధనలకు లోబడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకునేవారు కరోనా నిబంధనలు పాటించాల్సిందే. పరిమిత సంఖ్యలో అతిథుల సమక్షంలో వివాహ వేడుకను నిర్వహించుకోవాలి.

    అయితే తమిళనాడులోని మదురైకి చెందిన ఒక జంట లాక్‌డౌన్ సమయంలో వివాహం చేసుకోవడానికి ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకోంది. భూమి మీద కాకుండా ఆకాశంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వివరాలు.. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా తమిళనాడులో మే 31 వరకు లాక్‌డౌన్ విధించారు. ఆ సమయంలోనే మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి మదురై అమ్మవారిలో సన్నిధిలో జరగాల్సి ఉంది. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వారి పెళ్లిని ఎలాగైనా జరపాలని భావించిన ఆ జంట.. వినూత్నంగా ఆలోచన చేసింది. స్పైస్ జెట్‌కు చెందిన విమానాన్ని ఆ జంట రెండు గంటలు అద్దెకు తీసుకున్నారు. మొత్తం 161 మంది సన్నిహితులు, బంధువులను ఆ విమానంలో ప్రయాణించడానికి ఆహ్వానించారు. అంతా కలిసి మదురై నుంచి బెంగళూరుకు బయలుదేరారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఆ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. గాల్లో ఉండగానే రాకేష్.. దక్షిణ మెడలో తాళి కట్టాడు.

    చదవండి.. సెక్యూరిటీ గార్డుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు..

    విమానంలో ఉన్న అతిథులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారంతా చాలా సంతోషంగా ఈ పెళ్లి వేడుకను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆ తర్వాత విమానం బెంగళూరు నుంచి మదురైకి చేరుకుంది. అనంతరం పెళ్లికి హాజరైన అతిథుల వారి వారి ఇండ్లకు తిరిగి వెళ్లారు.
    Published by:Sumanth Kanukula
    First published: