Home /News /trending /

MADURAI BARBAR SALON OWNER OFFERS 50 PERCENT DISCOUNT FOR CUSTOMERS WITH COVID VACCINATION CERTIFICATE VB

Discount On Corona Vaccine Candidates: వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకు బంపర్ ఆఫర్.. అదేంటో తెలుసుకుందాం..

బార్బర్ షాప్

బార్బర్ షాప్

Discount On Corona Vaccine Candidates: వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు బంపర్ ఆఫర్ అంటూ ఓ బార్బర షాప్ యజమాని బోర్డు పెట్టాడు. వ్యాక్సిన్ వేయించుకున్నట్లు సర్టిఫికేట్ చూపిస్తే తన వద్ద కటింగ్ చేయించుకునే వాళ్లకు డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

ఇంకా చదవండి ...
    కరోనా నుంచి మనకు మనం కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే శ్రీ రామ రక్ష అని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకుంటే సైట్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయోమోనని చాలామంది దానికి దూరంగా ఉంటున్నారు. అపోహలను నమ్మోద్దని వైద్య అధికారులు సూచిస్తున్నప్పటికీ మారుమూల పల్లెల్లో చాలామంది ఇంకా ఆ అపోహలోనే ఉన్నారు. అయితే ఈ మధ్య ప్రభుత్వ అధికారులు వ్యాక్సిన్ వేయించుకుంటేనే రేషన్ బియ్యం ఇస్తామని నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. వారి ఆరోగ్యం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కూడా అధికారులు వివరణ ఇచ్చారు. దీంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు చాలామంది ముందుకు వచ్చారు. కొన్ని గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ గ్రామస్తులను వ్యాక్సిన్ వేయించుకునే విధంగా సర్పంచ్ లు ఎంతో కృషి చేసిన సందర్బాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా చెన్నైలోని ఓ కటింగ్ షాప్ లో ఓనర్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు తన షాప్ లో కటింగ్ చేయించుకున్నా.. షేవింగ్ చేయించుకున్నా ఎంత అమౌంట్ అవుతుందో అందులో సగం ఇస్తే చాలు అంటూ ఒక బోర్డును కూడా షాపు ముందు తగిలించాడు.


    ఎవరైతే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారో వాళ్లకే ఈ డిస్కౌంట్ ఉంటుందంటూ అందులో రాశాడు. మధురైలోని సెలూన్ షాప్ ఓనర్ కార్తికేయన్ ఈ ఆఫర్ ఇచ్చారు. థర్డ్ వేవ్ నుంచి బయటపడాలంటే అందురూ టీకా వేసుకోవాలని సూచిస్తున్నాడు. అందుకే వ్యాక్సిన్ సర్టిఫికేట్ చూపించిన వారికి 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు కార్తికేయన్ చెప్పాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు చేస్తున్న పనికి ప్రతీ ఒక్కరూ సలాం కొట్టారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Bumper offer, Chennai, Corona Vaccine, Sanjeevani, Tamilanadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు