Home /News /trending /

MADHYA PRADESHS KATRI DISTRICT COLLECTOR SENDS HIS DAUGHTER TO ANGANWADI FOR PRE SCHOOLING BS

కూతుర్ని అంగన్వాడీకి పంపిస్తున్న కలెక్టర్.. ప్రైవేటు ప్రీ స్కూళ్ల కంటే బెటర్ అంటూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Trending News: మధ్య తరగతివాళ్లు కూడా తమ పిల్లల్ని ‘ఖరీదైన’ ప్రీ స్కూళ్లకు పంపిస్తున్న ఈ రోజుల్లో ఆయన మాత్రం తన కూతుర్ని అంగన్వాడీకి పంపించారు. ఆయనే మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా కలెక్టర్ పంకజ్ జైన్.

    ఆయన ఓ జిల్లాకు కలెక్టర్.. ఉన్నత పదవి, మంచి జీతం, విలాసవంతమైన జీవితం.. చిటికేస్తే పది మంది పనివాళ్లు తన ముందుంటారు.. అంతటి ఉన్నతాధికారి కూతురు చదువు అంటే.. ప్రీస్కూలింగ్‌కే లక్షలు ఖర్చు పెట్టొచ్చు. డబ్బుల దాకా ఎందుకు? తన పరపతి వాడుకొని ఉచితంగా అడ్మిషన్ ఇప్పించుకోగలిగే అధికారం ఉంది. కానీ, ఆ కలెక్టర్ అలా చేయలేదు. వేలాది మందికి ఆదర్శంగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు. మధ్య తరగతివాళ్లు కూడా తమ పిల్లల్ని ‘ఖరీదైన’ ప్రీ స్కూళ్లకు పంపిస్తున్న ఈ రోజుల్లో ఆయన మాత్రం తన కూతుర్ని అంగన్వాడీకి పంపించారు. ఆయనే మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా కలెక్టర్ పంకజ్ జైన్. వేరొకరికి ఆదర్శంగా నిలిచి, వాళ్ల పిల్లల్ని అంగన్వాడీకి పంపేలా ప్రోత్సహించేందుకు ఆయనీ అద్భుత నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీల్లో సౌకర్యాలు పెంచాలంటే.. అధికారులంతా తమ పిల్లల్ని వాటిల్లో చేర్పించాలని, కొద్ది రోజుల్లోనే సౌకర్యాలు మెరుగవుతాయని అంటున్నారు పంకజ్. ప్రస్తుతం ఉన్న చాలా ప్రైవేటు ప్రీ స్కూళ్ల కంటే అంగన్వాడీలు చాలా బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు.

    ఆ కలెక్టర్ నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ కొనియాడారు. ‘సమాజానికి ప్రేరణే ప్రభుత్వ ఉద్యోగులు. వారిని చూసి సమాజం స్ఫూర్తి పొందుతుంది. మీ నిర్ణయం మిగతా ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలను పెంచింది. మీ డెడికేషన్, విధేయత కొనసాగుతుందని ఆశిస్తున్నా’ అని పంకజ్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
    First published:

    Tags: Anganwadi, IAS, Madhya pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు