హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇది కదా తల్లిప్రేమ.. బిడ్డ కోసం పులితో ప్రాణాలకు తెగించి పోరాడిన తల్లి..

ఇది కదా తల్లిప్రేమ.. బిడ్డ కోసం పులితో ప్రాణాలకు తెగించి పోరాడిన తల్లి..

పులి దాడిలో గాయపడ్డ బాలుడు

పులి దాడిలో గాయపడ్డ బాలుడు

Madhya Pradesh: తల్లి తన 15 నెలల బిడ్డను తీసుకుని ఇంటి నుంచి బైటకు తీసుకొచ్చింది. వీరి ఇల్లు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. అప్పటికే ఒక పులి వీరి కదలికలను గమనించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Madhya Pradesh, India

తన బిడ్డలకు అపకారం చేయాలని చూస్తే నోరున్న మనుషులే కాదు.. నోరు లేని జీవాలు కూడా వదిలిపెట్టవు. ఎదురుగా ఉన్న ఎవరున్న వదిలిపెట్టవు. ఇప్పటికే తల్లి, బిడ్డలపై చూపించే ప్రేమకు సంబంధించిన ఎన్నో ఘటనలు వైరల్ గా (Viral)  మారాయి. మనుషులు కూడా తమ బిడ్డలపై ఒక రకమైన ప్రత్యేక బంధాన్ని కల్గి ఉంటారు. తమ కడుపున పుట్టిన బిడ్డల కోసం నిరంతం కష్టపడుతుఉంటారు. పొరపాటున.. బిడ్డలకు ఏమైన జరిగితే తల్లిదండ్రులు అల్లాడిపోతుంటారు. ఇక నోరులేని జీవాలు కూడా ఇదే రకంగా ఉంటాయి. అడవిలోని ఎంత పెద్ద జీవులు.. క్రూర జంతువులైన తమ బిడ్డల జోలికి వస్తే వాటితో పోరాటానికి దిగేస్తాయి. బిడ్డప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేస్తాయి. ఇలాంటి ఎన్నో ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, తల్లి ప్రేమకు సంబంధించిన మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని (Madhya Pradesh) బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ ఏరియా ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న గ్రామంలో ఈ ఘటన జరిగింది. అర్చన అనే మహిళ, తన కుటుంబంతో ఉమారియా జిల్లాలోని మాలా బీట్ పరిధిలోని రోహనియా గ్రామంలో ఉంటుంది. ఆమెకు రవిరాజ్ అనే 15 నెలల పిల్లాడు ఉన్నాడు. అయితే.. ఆమె తన పిల్లాడిని తీసుకుని ఇంటి నుంచి బైటకు వచ్చింది. అప్పడు.. ఒక పులి (Tiger) అక్కడే పొదల్లో కాచుకూని చూస్తుంది. వీరిని గమనించి వెంటనే దాడికి పాల్పడింది. అర్చన పైకి ఎగిరి దాడి చేసింది. పిల్లాడి తలను నోటితో పట్టుకొవడానికి ప్రయత్నించింది. అయితే.. మహిళ వెంటనే తెరుకుంది.

పులితో పోరాటానికి దిగింది. పులి పంజాతో దాడి చేస్తున్న ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా, దాన్ని ప్రతిఘటించింది. తన బిడ్డ దాని నోటికి చిక్కకుండా గట్టిగా అరుస్తూ గ్రామస్థులను పిలిచింది. మహిళ అరుపులు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. చేతిలో కర్రలు, చీపుర్లు పట్టుకుని, పెద్దగా చప్పుళ్లు చేశారు. దీంతో భయపడిపోయిన పులి ఆమెను అక్కడే వదిలేసి అడవుల్లోకి పారిపోయింది. అర్చన శరీరమంతా పులిగోళ్లలో దాడుల చేసింది. ఆమె శరీరమంతా రక్తంతో నిండిపోయింది. వెంటనే ఆమెను గ్రామస్థులు దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మరల మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఈ ఘటన ఆదివారం జరిగింది. తొలుత తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఒక రోజు గడిస్తే కానీచెప్పలేమని వైద్యులు చెప్పారు. ఆ తర్వాత.. సోమవారం తల్లి ప్రాణాపాయం నుంచి బైటపడిందని వైద్యులు పేర్కొన్నారు. ఈ పోరాటంలో అర్చన పొత్తికడుపు, వీపు, చేతులకు గాయాలయ్యాయని ఆమె భర్త భోళా ప్రసాద్ తెలిపారు. ఉమారియా కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ ఆసుపత్రిలో ఉన్న మహిళ, ఆమె కుమారుడిని పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశ మయ్యారు.పులిని తిరిగి అడవిలోనికి వెళ్లేలా చేస్తామని అన్నారు. ప్రజలంతా బైటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Madhya pradesh, Tiger Attack, VIRAL NEWS

ఉత్తమ కథలు