హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వామ్మో.. బాలిక స్కూల్ బ్యాగ్ లో కాలనాగు.. వీడియో వైరల్..

వామ్మో.. బాలిక స్కూల్ బ్యాగ్ లో కాలనాగు.. వీడియో వైరల్..

బాలిక స్కూల్ బ్యాగ్ లో కాలనాగు

బాలిక స్కూల్ బ్యాగ్ లో కాలనాగు

Madhya pradesh:  బాలిక ఉదయాన్నే పాఠశాలకు వెళ్లింది. ఇంతలో ఆమె బ్యాగు నుంచి వింతగా శబ్దం వస్తుండటంతో ఆమె బుక్స్ ను పక్కకు తీసి చూసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Madhya Pradesh, India

మనలో చాలా మందికి పాములంటే (Snake) చచ్చేంత భయం. పొరపాటున పాములు కన్పిస్తే భయంతో వణికిపోతున్నారు. ఎవరన్నా.. అటువైపు పాములున్నాయంటే.. ఇక అక్కడికి అసలు పోవడానికి కూడా సాహాసం చేయరు. కొన్నిసార్లు ఎవరన్నా భయపెట్టడానికి పామును చూశామని చెప్పిన .. భయంతో వణికిపోతుంటారు. అయితే.. పాములు ఆహారం కోసం, ఆవాసం కోసం కొన్నిసార్లు అటవీ నుంచి మానవ ఆవాసాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో అవి మనుషుల కంటపడతాయి. కొన్నిసార్లు అవి మనుషులను కాటు వేస్తుంటాయి. మరికొన్నిసార్లు అవి మనుషుల చేతిలో చనిపోతుంటాయి. అయితే.. కొందరు మాత్రం పాములు కన్పిస్తే స్నేక్ హెల్ప్ సోసైటీవారికి సమాచారం ఇస్తుంటారు. పాములను హనీ తలపెట్టడానికి ఇష్టపడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మధ్యప్రదేశ్ లోని (Madhya pradesh) షాజాపూర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న బడోని స్కూల్ లో ఒక బాలిక బ్యాగులో నుంచి పాము బయటకు వచ్చింది. దీంతో స్కూల్ సిబ్బంది.. స్నేక్ హెల్ప్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. కాగా, బడోని స్కూల్ లో వశిష్ట అనే 10 వ తరగతికి చెందిన విద్యార్థి తన బ్యాగ్ లోపల ఏదో శబ్దం రావడం గమనించింది. వెంటనే బ్యాగులో చూసింది.

ఈ క్రమంలో బ్యాగులో నుంచి పాముతోక కన్పించింది. వెంటనే సిబ్బంది పాములను పట్టేవారికి సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాల ఆవరణలో బ్యాగును తీసుకెళ్లి చెట్ల మధ్యలో పెట్టారు. అప్పుడు బ్యాగు నుంచి పాము బయట పడింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. వెంటనే అది పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని, స్కూల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Madhya pradesh, Snake, Viral Video