• HOME
 • »
 • NEWS
 • »
 • TRENDING
 • »
 • MADHYA PRADESH TEA SELLER S DAUGHTER GETS IAF WINGS AS TOP FLYING CADET NK

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ పోస్ట్ సాధించిన టీకొట్టు వ్యాపారి కూతురు...

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ పోస్ట్ సాధించిన టీకొట్టు వ్యాపారి కూతురు...

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ పోస్ట్ సాధించిన టీకొట్టు వ్యాపారి కూతురు...(credit - twitter - ANI)

ఓవైపు కష్టపడి చదువుకుంటూనే... అనాచల్ తరచూ తండ్రి టీ స్టాల్‌కి వెళ్లేది. అక్కడే హోం వర్క్ చేసుకునేది. తండ్రికి సాయపడేది. అందువల్ల బాగా చదవాలి, ఏదైనా సాధించాలనే పట్టుదల ఆమెలో బలంగా పెరిగింది.

 • Share this:
  ఎవరైనా మంచి పని చేస్తే, గొప్పది ఏదైనా సాధిస్తే... మెచ్చుకోవడం మనకు అలవాటేగా... ఇప్పుడు మనకో పని పడింది. ఏంటంటే... 23 ఏళ్ల అనాచల్ గంగ్వాల్... తన కల నెరవేర్చుకుంది. చిన్నప్పటి నుంచి తనను తాను యూనిఫామ్‌లో చూసుకోవాలనుకుంటూ... కష్టపడి చదివిన ఆమె... పట్టుదలతో సాధించింది. మధ్యప్రదేశ్‌లోని... ఓ టీకొట్టు వ్యాపారి కూతురైన ఆమె... ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో... ఫ్లైయింగ్ ఆఫీసర్‌ పోస్టును సాధించింది. అంతకు ముందు ఆమె... రాష్ట్ర ప్రభుత్వంలో లేబర్ ఇన్‌స్పెక్టర్‌గా చేసింది. తన ప్రతిభతో వేగంగా విజయాలు సాధిస్తూ... వెంటనే సబ్ ఇన్‌స్పెక్టర్ అయ్యింది. అక్కడా మెరిట్ సాధించింది. తాజాగా... దిండిగల్‌లో... 123 మంది కాడెట్లలో... అనాచల్... ప్రెసిడెంట్స్ ప్లాక్ సాధించింది. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో దాన్ని ఆమెకు బహుకరించారు.

  ఇంత మంచి సందర్భాన్ని... అనాచల్ వెంటనే తన తల్లిదండ్రులతో పంచుకోలేకపోయింది. ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌కి ఆమె పేరెంట్స్ సురేష్, బబితా గంగ్వాల్ రాలేదు. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా... ఎవర్నీ ఆహ్వానించలేదు అధికారులు. టీ కొట్టు నడిపే సురేష్... చిన్నప్పుడు తన తల్లిదండ్రులకు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయని గ్రహించి... తన హైస్కూల్ చదువును మధ్యలోనే మానేశాడు. ఇప్పుడు తన కూతుర్ని మాత్రం బాగా చదివించాడు. ఆమెపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని అనాచల్ నిలబెట్టుకుంది.

  ఓవైపు కష్టపడి చదువుకుంటూనే... అనాచల్ తరచూ తండ్రి టీ స్టాల్‌కి వెళ్లేది. అక్కడే హోం వర్క్ చేసుకునేది. తండ్రికి సాయపడేది. అందువల్ల బాగా చదవాలి, ఏదైనా సాధించాలనే పట్టుదల ఆమెలో బలంగా పెరిగింది. సురేష్ దంపతులకు ముగ్గురు పిల్లలు. (ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి). కుటుంబాన్ని నెట్టుకు రావడానికి తన పేరెంట్స్ పడే కష్టాన్ని కళ్లారా చూస్తూ పెరిగిన అనాచల్... వాళ్లు తన కోసం ఎంతలా శ్రమిస్తున్నారో గ్రహిస్తూ... ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలని బలంగా డిసైడైంది. అంతకు ముందు స్కూల్ డేస్‌లో ఇండియన్ ఆర్మీలో చేరాలనే కల కూడా కంది. ఈ విషయం తన పేరెంట్స్‌కి చెప్పినప్పుడు మొదట కాస్త ఆందోళన చెందినా... తర్వాత... "నువ్వు సాధిస్తావు తల్లీ... ధైర్యంగా చదువుకో" అని ఎంకరేజ్ చేశారు.

  నీముచ్‌లోని... సీతారామ్ జాజు ప్రభుత్వం బాలికల కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన అనాచల్... తాజాగా పాసింగ్ అవుడ్ పరేడ్‌ టీవీలో రావడాన్ని తన పేరెంట్స్‌తో కలిసి చూసి ఎంతో ఆనందపడింది. ఈ పరేడ్‌లో ఎయిర్ చీఫ్ మార్షల్ RSK భదారియా ఏమన్నారంటే... ఏటా... పరేడ్ తర్వాత కొత్త ఆఫీసర్లు... బ్రేక్ కోసం ఇళ్లకు వెళ్తారు. ఈ సంవత్సరం మాత్రం... వారిని నెక్ట్స్ యూనిట్‌కి పంపి... వెంటనే బాధ్యతలు అప్పగిస్తున్నాం అని చెప్పారు. ఇలాంటి అవకాశాన్ని తాను ఎప్పుడూ వదులుకోనని అనాచల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పింది. అందుకే మనం మెచ్చుకోవాల్సిన పని పడింది అన్నది. అంతే కదా...
  First published: