హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

గుడిలో కొత్త వరుడికి షాకింగ్ ఘటన.. సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..

గుడిలో కొత్త వరుడికి షాకింగ్ ఘటన.. సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..

సీసీ కెమెరాలో రికార్డైన చోరీ..

సీసీ కెమెరాలో రికార్డైన చోరీ..

Madhya Pradesh: కొందరు సులువుగా డబ్బులు సంపాదించడానికి అడ్డమైన పనులు చేస్తుంటారు. చోరీలు చేయడం, రోడ్డుపైన వెళ్లే ప్రయాణికుల బంగారు చైన్ లు కాజేయడం చేస్తుంటారు.

  • Local18
  • Last Updated :
  • Madhya Pradesh, India

కొందరు సులువుగా డబ్బులు సంపాదించడానికి అడ్డమైన పనులు చేస్తుంటారు. చోరీలు చేయడం, రోడ్డుపైన వెళ్లే ప్రయాణికుల బంగారు చైన్ లు కాజేయడం చేస్తుంటారు. మరికొందరు ఇంటి దగ్గర ఉండే ఒంటరి మహిళలు, రోడ్డుపైన వెళ్లేవారిని టార్గెట్ చేసుకుంటారు. అడ్రస్ అడిగినట్లు చేసి, ఏదో ఏమార్చినట్లు మాట్లాడి చిటికెలో చోరీలు చేసి మాయమైపోతుంటారు. దీని కోసం ఈ దొంగలు.. గుడులు, బ్యాంక్ లు, కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను ఎన్నుకుంటుంటారు.

ఈ క్రమంలో ఇక్కడ చోరీలు చేయడానికి తమ గ్యాంగ్ లతో కలసి సిద్దంగా ఉంటారు. అయితే.. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అప్ డేట్ అయ్యింది. అందుకే ప్రతి ఒక్కరు తమ చుట్టుపక్కల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనితో చోరీ ఘటన వాటిల్లో రికార్డు అవుతుంది. దీంతో పోలీసులు వీరిని సులువుగా గుర్తించడానికి వీలుపడుతుంది. ఇలాంటి ఒక చోరీ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లో (Madhya Pradesh)  విచిత్రమైన చోరీ సీసీకెమెరాలో రికార్డు అయ్యింది. స్థానికంగా ఉన్న శివపురి ప్రాంతంలో కొలారస్ దగ్గరలోని హోటల్ లో పెళ్లి వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో.. వరుడి తల్లి, తన కొడుకుతో కలిసి అక్కడే ఉన్నన హనుమాన్ ఆలయంలో దర్శనానికి వెళ్లింది. అప్పుడు..వరుడి తల్లి తన చేతిలో బ్యాగ్ ను ఆలయంలో పక్కకు పెట్టి దర్శనం చేసుకుంది.

కాసేపటికి బ్యాగ్ ను చూస్తే అక్కడ లేదు. వెంటనే అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, ఆ సంచిలో సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. వెంటనే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక యువకుడు బ్యాగ్ ను తీసుకెళ్తుండటం దానిలో రికార్డు అయ్యింది. వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Madhya pradesh, VIRAL NEWS, Wedding