ఒక్కొసారి మనం రైల్వేస్టేషన్ (Railway station) కు వెళ్లినప్పుడు ఒక ట్రైన్ కు బదులుగా మరో రైలు ఎక్కుతాం. దీంతో ఆ తర్వాత.. తెరుకొని గాబరాగా దిగడానికి ప్రయత్నిస్తుంటాం. అలాంటి సమయలో ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పటి వరకు పట్టాలు దాటుతుండగా, సిగ్నల్ వద్ద రైళ్లు ఢీకొని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని సార్లు అలాంటి వారికి అదృష్టం బాగుండి, అక్కడి స్థానికులు లేదా అధికారులు సమయానికి స్పందించడం వలన బతికి బట్టకట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
"जल्दबाजी हो सकती है घातक"#उज्जैन- गलत ट्रैन में सवार हुई महिला,पता चलने पर जल्दबाजी में प्लेटफॉर्म पर चलती ट्रेन से उतरी, संतुलन बिगड़ने से महिला ट्रैन की चपेट में आने से बची,प्लेटफार्म पर मौजूद पुलिस कर्मी महेश कुशवाहा की सतर्कता से हादसा टला,#GRP@RailwaySeva#Ujjain#CCTVpic.twitter.com/943niH1usl
— vikas singh Chauhan (@vikassingh218) May 14, 2022
పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh) షాకింగ్ ఘటన జరిగింది. ఉజ్జయినీలోని స్థానిక రైల్వేస్టేషన్ లో ఒక మహిళ తన పిల్లలతో కలిసి రైలు ఎక్కడానికి వచ్చింది. అయితే , ఆమె తొందరలో ఒక ట్రైన్ కు బదులుగా మరోక ట్రైన్ ఎక్కింది. ఆ తర్వాత..తేరుకొంది. కానీ అప్పటికే రైలు స్టార్ట్ అయ్యింది. దీంతో తన పిల్లలను రైలు నుంచి ప్లాట్ ఫామ్ మీదకు తోసేసింది. ఆ తర్వాత, ఆమె కూడా దూకడానికి ప్రయత్నించింది. అప్పుడు ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఆమె దూకగానే అదుపుతప్పి కిందపడిపోయింది. వెంటనే అక్కడే ఉన్నరైలు కిందకు జారీపోతుంది.
దీన్ని అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ (Rpf constable) ముఖేష్ కుష్వాహా గమనించాడు. వెంటనే సమయస్పూర్తితో మహిళలను పైకి లాగాడు. దీంతో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది. అక్కడ ఉన్న ప్రయాణికులు కానిస్టేబుల్ చూపిన సాహసానికి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు హ్యాట్సాఫ్ సర్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.