Home /News /trending /

MADHYA PRADESH POOR WOMAN WHO WORKS AS A DOMESTIC HELP HAS BEEN SLAPPED WITH A RS 2 5 LAKH ELECTRICITY BILL GH SRD

Electricity Bill: కరెంట్ షాక్... పూరి గుడిసెకు రూ.2.5 లక్షల విద్యుత్ బిల్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Electricity Bill: ఇళ్లల్లో పనిచేసే ఆ వృద్ధురాలు ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. కేవలం ఒక ఎలక్ట్రిక్​​ లైట్​ లైటు, టేబుల్​ ఫ్యాన్​ మాత్రమే ఉన్న ఆ ఇంటికి ఏకంగా రూ .2.5 లక్షల విద్యుత్ బిల్లు రావడాన్ని చూసి అవాక్కయ్యింది.

కరెంటు తీగను పట్టుకుంటేనే కాదు.. అప్పడప్పుడు కరెంట్​ బిల్లు చూసినా షాక్​ కొడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక కారణాల వల్ల పూరి గుడిసెలో నివసించే వ్యక్తులకు కూడా రూ.లక్షల్లో కరెంట్​ బిల్లులు వచ్చిన సందర్భాలెన్నో. ఆ బిల్లులు కూడా సోషల్​ మీడియాలో వైరల్​గా మారుతుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్​కు చెందిన ఒక నిరుపేద వృద్ధురాలికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. ఇళ్లల్లో పనిచేసే ఆ వృద్ధురాలు ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. కేవలం ఒక ఎలక్ట్రిక్​​ లైట్​ లైటు, టేబుల్​ ఫ్యాన్​ మాత్రమే ఉన్న ఆ ఇంటికి ఏకంగా రూ .2.5 లక్షల విద్యుత్ బిల్లు రావడాన్ని చూసి అవాక్కయ్యింది. వివరాల్లో కెళితే.. మధ్యప్రదేశ్​లోని గుణ జిల్లాకు చెందిన 65 ఏళ్ల రాంబాయి ప్రజాపతి అనే వృద్ధురాలు పూరి గుడిసెలో నివసిస్తుంది. స్థానికంగా కొన్ని ఇళ్లలో ఇంటి, వంట పనుల్లో సహాయకారిగా పనిచేస్తుంది. ఆమెకు ఇది వరకు రూ. 300 నుంచి రూ. 500కు మించి కరెంట్ బిల్లు వచ్చేది కాదు. కానీ గత నెలలో ఏకంగా రూ .2.5 లక్షల కరెంట్​ బిల్లు రావడం చూసి షాకైంది. విద్యుత్​ అధికారుల ముందు తన గోడు వెల్లబోసుకునేందుకు స్థానిక విద్యుత్ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతిరోజూ ఆఫీసు బయట ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని అధికారుల కోసం ఎదురు చూస్తుంది.

విద్యుత్​ అధికారులను ఎన్ని సార్లు అడిగినా.. వారు తన వాదన పట్టించుకోవడం లేదని వాపోతుంది. సదరు వృద్ధ మహిళ న్యూస్ 18తో మాట్లాడుతూ ‘‘నేను చాలా సంవత్సరాల నుంచి షాన్టీ ప్రాంతాలోని ఒక గుడిసెలో నివసిస్తున్నాను. కేవలం ఒక ఎలక్ట్రిక్​ బల్బ్, టేబుల్ ఫ్యాన్ మాత్రమే ఉపయోగిస్తున్నాను. గతంలో నాకు ప్రతి నెలా 300 నుంచి 500 వరకు కరెంట్​ బిల్లు వచ్చేది. అయితే, లాక్​డౌన్​ కారణంగా ఆ బకాయిలు చెల్లించలేకపోయాను. గత నెలలో నాకు అనూహ్యంగా 2.47 లక్షల కరెంట్​ బిల్లు వచ్చింది.

ఇంత చిన్న పూరి గుడిసెలో నివసించే నాకు లక్షల్లో బిల్లు ఎలా వచ్చిందో తెలియడం లేదు. దీనిపై అధికారును సంప్రదిస్తే వారు అస్సలు పట్టించుకోవడం లేదు. ‘నా సమస్య పరిష్కారం కోసం కేవలం విద్యుత్​ అధికారులనే కాదు స్థానిక ప్రజా ప్రతినిధులను, గుణ కలెక్టర్ కూడా కలిశాను. కానీ ఎవరూ నా సమస్యను పరిష్కరించలేదు” అని వాపోయింది.
సమాధానం చెప్పని అధికారులు..

ఇదే విషయంపై న్యూస్ 18 టీం విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారులను సంప్రదించగా.. వారు దీనిపై మాట్లాడటానికి నిరాకరించారు. కాగా, ఇటీవల మధ్యప్రదేశ్ పవర్ రెగ్యులేటరీ కమిషన్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచింది. అందువల్ల, ఏదైనా సాఫ్ట్​వేర్​ తప్పిదం కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని తెలుస్తోంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: ELectricity, Madhya pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు