ఇద్దరమ్మాయిలతో యువకుడి పెళ్లి.. సీరియస్ ప్రాబ్లంకి సరదా ముగింపు..

ఓ పెళ్లికొడుకు, పెళ్లిపీటల మీద పక్కపక్కనే ఇద్దరమ్మాయిలు. ఎంచక్కా కళ్యాణం వైభోగంగా జరిగింది.

news18-telugu
Updated: July 10, 2020, 8:22 PM IST
ఇద్దరమ్మాయిలతో యువకుడి పెళ్లి.. సీరియస్ ప్రాబ్లంకి సరదా ముగింపు..
ఇద్దరమ్మాయిలను ఒకే మండపంలో పెళ్లిచేసుకున్న యువకుడు (Image;IANS)
  • Share this:
అసలే లాక్ డౌన్. పెళ్లిళ్లు జరగడం చాలా కష్టంగా ఉంది. అయితే, ఆ ఊళ్లో పెళ్లి ధూంధాంగా జరిగింది. ఓ పెళ్లికొడుకు, పెళ్లిపీటల మీద పక్కపక్కనే ఇద్దరమ్మాయిలు. ఎంచక్కా కళ్యాణం వైభోగంగా జరిగింది. వధువులు, వరుడు ఎంచక్కా హ్యాపీగా ఉన్నారు. ఒకే మండపంలో ఒకే పీటల మీద ఇద్దరమ్మాయిలను ఎలా పెళ్లి చేసుకున్నాడు. ఎవరా వ్యక్తి అని తెలుసుకోవాలనుకుంటున్నారా?. అయితే, స్టోరీలోకి వెళదాం. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. బేతుల్ జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో సందీప్ అనే యువకుడు ఇలా ఇద్దరమ్మాయిలను ఒకే మండపంలో పెళ్లి చేసుకున్నాడు. సందీప్ చదువుకునేటప్పుడు హోషంగాబాద్‌కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఈ లవ్ గివ్ నచ్చని కుటుంబసభ్యులు అతడికి మరో పెళ్లి ఖాయం చేశారు. ఆ ముహూర్తాలుకూడా దగ్గరపడ్డాయి. దీంతో నా ప్రియుడు నాకే సొంతం అంటూ లవర్ గొడవకు దిగింది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు, లవర్ ఫ్యామిలీలు పెద్దల వద్దకు పంచాయితీకి వెళ్లాయి. అక్కడ వారు అందరికీ సర్దిచెప్పడానికి ప్రయత్నించారు కానీ అమ్మాయిలు ఇద్దరూ అతడినే పెళ్లిచేసుకుంటామని భీష్మించారు. ఇద్దరూ అతడితో కలసి జీవించడానికి సిద్ధమయ్యారు. దీని వల్ల సమస్యలు వస్తాయని, భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయని రెండు కుటుంబాల వారు నచ్చజెప్పారు. అయినా కూడా ఇద్దరు అమ్మాయిలు అతడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. పెద్దలు కూడా ఓకే చెప్పడంతో పెళ్లి బాజాలు మోగాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 10, 2020, 8:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading