Free Petrol: మూడు రోజులు పెట్రోల్ ఫ్రీ.. బారులు తీరిన జనం.. ఎక్కడంటే..?

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు క్రమంగా పెరగడం.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పెట్రోల్ ధర రూ. 110 దాటింది. లీటర్ డీజిల్‌ కూడా రూ. 100కు పైనే ఉంది.

  • Share this:
    దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు క్రమంగా పెరగడం.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పెట్రోల్ ధర రూ. 110 దాటింది. లీటర్ డీజిల్‌ కూడా రూ. 100కు పైనే ఉంది. కానీ ఓ వ్యక్తి మాత్రం.. మూడు రోజుల పాటు కస్టమర్లకు ఉచితంగా పెట్రోల్ (Free Petrol) అందించాడు. తమ కుటుంబంలో ఆడపిల్ల పుట్టినందుకు సంబరాల్లో భాగంగా ఈ విధంగా చేశారు. వివరాలు.. మధ్యప్రదేశ్ బేతుల్‌ జిల్లాకి (Betul district) చెందిన దీపక్ సైనానికి పెట్రోల్ బంక్ ఉంది. ఈ నెల 9వ తేదీన అతని సోదరి శిఖా పోర్వాల్‌కు ఆడపిల్ల జన్మించింది. దీంతో ఆ కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఈ సంబరాలను ప్రత్యేకమైన రీతిలో జరుపుకోవాలని వారు భావించారు. ఈ క్రమంలోనే నవరాత్రి పర్వదినాల్లో బంక్‌కు వచ్చే కస్టమర్లకు మూడు రోజులు ఉచితంగా పెట్రోల్ (Free Petrol to Celebrate Birth of Girl Child) అందించాలని భావించాడు. అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేసే ముందు తాను చాలా విధాలుగా ఆలోచించానని దీపక్ సైనాని తెలిపారు.

    ‘ప్రజలు దీనిని పబ్లిసిటీ స్టంట్‌గా భావించాలని నేను కోరుకోలేదు. అందుకే నేను ఆలోచన సరైనదా..? కాదా..? అని కొద్దిసేపు విశ్లేషించుకున్నాను. కానీ ఆ నిర్ణయంపై ముందుకు సాగాలని డిసైడ్ అయ్యాను’అని దీపక్ సైనాని Indian Expressకు తెలిపాడు.

    Acidity: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా?.. అయితే ఈ ఆహారాలు, చిట్కాలతో చెక్ పెట్టండి

    త‌న బంకుకు వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్ల‌కు పెట్రోల్‌ ఫ్రీ అని ప్ర‌క‌టించాడు. అక్టోబ‌ర్ 13,14,15 తేదీల్లో తన నిర్ణయాన్ని అమలు చేశాడు. ఆ రోజుల్లో కస్టమర్లకు 5-10 శాతం అదనపు పెట్రోల్ (extra petrol) ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.ఈ మేరకు పెట్రోల్ బంక్‌లో బోర్డులు ఏర్పాటు చేశారు. అక్టోబర్‌ 13, 14, 15 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 10 శాతం అదనంగా పెట్రోల్‌ ఉచితం అని ప్రకటించాడు. రూ.100లకు పెట్రోల్‌ కొన్న కస్టమర్లకు 5 శాతం, 200 - 500 రూపాయలకు పెట్రోల్‌ కొన్నవారికి 10 శాతం పెట్రోల్‌ ఫ్రీగా అందించారు.

    Car Loan: కారు లోన్ తీసుకోవాలనుకుంటున్నారా?.. అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక తెలుసుకోండి..

    ‘నేను ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉండటం గమనించాను. దీంతో ఈ సమయంలో అదనంగా 5-10 శాతం అందించాలని నిర్ణయించుకున్నాను’అని దీపక్ సైనాని (Deepak Sainani) తెలిపాడు. ఇక, ఈ బంక్ తన సోదరుడితో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నానని దీపక్ చెప్పాడు. అయితే తన సోదరి వైకల్యంతో బాధపడుతుందని.. ఈ చర్య ద్వారా తాము ఆమెకు బహుమతి అందజేశామని అన్నాడు. పెట్రోల్ ధ‌ర‌లు మండిపోతున్న నేప‌థ్యంలో ఇలా మూడు రోజుల పాటు పెద్ద మొత్తంలో పెట్రోల్‌ను అందించ‌డం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆఫర్ కోసం జనాలు దీపక్ పెట్రోల్ బంక్ వద్దకు భారీగానే చేరుకున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: