Home /News /trending /

MADHYA PRADESH HE VACCINATED 30 STUDENTS WITH 1 SYRINGE THEN ASKED HOW IS IT MY FAULT PAH

ఇదేంది రా నాయన.. 30 మంది విద్యార్థులకు ఒకే సిరంజితో కొవిడ్ టీకా.. కారణం ఏంటంటే..

జితేంద్ర (ఫైల్)

జితేంద్ర (ఫైల్)

Madhya pradesh: పాఠశాలలో కొవిడ్ టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మెడికల్ సిబ్బంది ఒకే సిరంజీతో విద్యార్థులందరికి టీకా ఇవ్వడం తీవ్ర కలకలంగా మారింది.

కొందరు మెడికల్ సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అనేక చోట్ల మెడికల్ మాఫియాగా ఏర్పడుతున్నారు. కాలం చెల్లిన మందులు, తక్కువ ధరకు వస్తున్న ట్యాబ్లెట్ లు ఇస్తు.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మరికొందరు మందులపై డూప్లికేట్ బార్ కోడ్ లు వేసి.. కంపెనీకి చెందిన లేబుల్స్ ను అచ్చు వేస్తున్నారు. అసలు.. నకిలీవో, నిజమైన ట్యాబ్లెట్ లు ఏవో కూడా తెలుసుకొవడం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మరికొన్ని చోట్ల.. ఒకటే సిరంజితో చాలా మందికి టీకాలు ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో వస్తునే ఉంటారు. ప్రస్తుతం మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh) షాకింగ్ ఘటన జరిగింది. సాగర్ జిల్లాలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యార్థులకు కోవిడ్ టీకా శిబిరం సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. చిన్నారులకు ఒకే సిరంజితో టీకాలు వేయడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీనిపై అక్కడి సిబ్బందిని నిలదీశారు. అక్కడ విద్యార్థులకు టీకాలు ఇస్తున్న వ్యక్తిని ప్రశ్నించారు.దీనికి జితేంద్ర అనే మెడికల్ సిబ్బంది..  చెప్పిన సమాధానానికి అక్కడున్న వారు షాక్ కు గురయ్యారు.





తన పై అధికారులే..తనకు ఒక సిరంజి ఇచ్చారని చెప్పాడు. వారు పంపితేనే వచ్చానని.. ఇందులో తన తప్పేంటని తిరిగి ప్రశ్నించాడు. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ క్షితిజ్ సింఘాల్ వెంటనే తనిఖీలు నిర్వహించాలని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌ను ఆదేశించారు. అయితే తనిఖీ సమయంలో జితేంద్ర కనిపించలేదు. ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, భారతదేశంలో జనవరి 2021లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించటానికి ఒక నెల ముందు, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కఠినమైన "ఒక సూది, ఒక సిరంజి, ఒకే సారి" ప్రోటోకాల్‌ను ప్రతిజ్ఞ చేసింది. భారత్ లో 1990 నుంచి ఎయిడ్స్ వెలుగులోనికి వచ్చినప్పటి నుంచి ఒకటే సిరంజీని వాడటాన్ని పూర్తిగా నిషేధించింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Corona Vaccine, Covid, Madhya pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు