Amazon: అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ తన భార్యకు విడాకుల ద్వారా ఇచ్చే భరణం ఎంతంటే..

Amazon Founder Jeff Bezos: విడాకుల ఒప్పందం ప్రకారం మెకంజీకి జెఫ్ 38 బిలియన్ డాలర్ల మొత్తాన్ని భరణం ఇవ్వనున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 3, 2019, 7:17 AM IST
Amazon: అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ తన భార్యకు విడాకుల ద్వారా ఇచ్చే భరణం ఎంతంటే..
జెఫ్ బెజోస్, మెకంజీ
  • Share this:
అమెజాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం. ఈ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(55) తన భార్య మెకంజీ(49)కి విడాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ విడాకుల ఒప్పందం ప్రపంచంలోకెళ్లా అత్యంత ఖరీదైనదిగా నిలవనుంది. ఒప్పందం ప్రకారం ఆయన మెకంజీకి 38 బిలియన్ డాలర్ల మొత్తాన్ని భరణం ఇవ్వనున్నారు. అది భారతీయ కరెన్సీలో.. అక్షరాలా 2.62 లక్షల కోట్లకు పైమాటే. భరణం పొందడం ద్వారా మెకంజీ ప్రపంచంలోనే అత్యంత నాలుగో ధనిక మహిళగా అవరించనున్నారు. కాగా, వీరి విడాకుల ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పూర్తయ్యింది. అయితే, ఆర్థిక లావాదేవీలు, సంబంధిత ప్రక్రియను పూర్తి చేయడానికి 90 రోజుల పాటు గడువు నిర్ణయించుకున్నారు. ఆ గడువు ఈ వారంలో పూర్తి కావస్తోంది.

ఇదిలా ఉండగా, మెకంజీకి రూ. 2.62 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని భరణంగా చెల్లించినప్పటికీ జెఫ్‌ బెజోస్‌ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగానే కొనసాగనున్నారు. మరోవైపు, భరణంగా తనకు వచ్చే మొత్తంలో సగానికిపైగా సంపదను సమాజ సేవకే కేటాయిస్తానని మెకంజీ ప్రకటించిన విషయం తెలిసిందే. 1993లో వివాహం చేసుకున్న వీరిద్దరు 1994లో అమెజాన్‌ను స్థాపించారు. 26 ఏళ్ల పాటు సాగిన వీరి వైవాహిక జీవితం విడాకులతో ముగిసింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: July 3, 2019, 7:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading