Super car: సందులో ఇరుక్కుపోయిన రూ.4 కోట్ల కారు.. తంటాలు పడ్డ డ్రైవర్

సందులో ఇరుక్కుపోయిన సూపర్​ కారు

ఆ కారు ఓనర్​ తాను హీరో అనుకున్నాడు కాబోలు. హాలీవుడ్​ సినిమాలో చూపించినట్లు సందులో నుంచి రూ.4 కోట్ల విలువైన కారును తీసుకోని వెళ్లాలని ప్రయత్నించాడు. ఇరుక్కుపోయాడు.

  • Share this:


    ఇటలీ(Italy).. అదొక అందమైన టూరిస్టు నగరం.. అక్కడో వీధిలోని సందులో కారు ఇరుక్కుపోయింది. ఏం అయితే మాకేంటి అంటారా? అంటే ఇరుక్కుంది ఓ సూపర్​ కారు (Super car).. ధర రూ. 4 కోట్ల వరకు ఉంటుంది. అలాంటి కారు సందులో ఎలా ఇరుక్కుంది అంటారా.. మ్యాటరేంటంటే.. ఇటలీలో ఉండే ఓ బడా వ్యక్తికి ఉంది ప్రముఖ లగ్జరీ ఫెరారీ రోమా వి8 సూపర్ కారు ఉంది. ఇంకేం రూడ్లపై తెగ స్పీడ్​గా వెళ్లాడు. అయితే మరీ అత్యవసరమూ ఏమో కానీ, షార్ట్​ కట్​ కోసం చూశాడు. తను వెళ్లాల్సిన వీధిలో ఓ సందు కనిపించింది. అంతే రుయ్​..రుయ్​.. అంటూ సందులోకి వెళ్లిపోయాడు. డ్రైవర్ చేసిన నిర్వాకం వల్ల అది సందుల్లో ఇరుక్కుపోయింది. carచివరకు ఆ కారును ఆ సందులో నుంచి తీసుకోని వచ్చాడా? లేదా అనేది అస్పష్టంగా ఉంది. యూట్యూబ్ వీడియోలో మాత్రం డ్రైవర్ ఇరుకైనా సందు నుంచి సూపర్ కారును బయటకు తీయడానికి చాలా కష్టపడటం మనం చూడొచ్చు.

    ఆ కారు గురించి తెలుసా..

    ఫెరారీ రోమా ఏమి చిన్న కారు కాదు. ఇది 183.3 అంగుళాల పొడవు, 77.7 అంగుళాల వెడల్పు ఉంటుంది. అందుకే కాబోలు సందులో ఇరుక్కుపోయింది. ఇక ఈ సూపర్ కారు బరువు 1,472 కిలోలు ఉంటుందట.  రూ.4 కోట్ల విలువైన కారు సందులో ఇరుక్కొని పోవడం వల్ల దానికి ఎంతో కొంత నష్టం వాటిల్లింది అనే విషయం వీడియోలో చూస్తే మనకు అర్థం అవుతుంది. ఫెరారీ రోమాలో 4.0-లీటర్ టర్బోఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5,750 - 7,500 ఆర్ పీఎమ్ వద్ద 603 బిహెచ్ పీ పవర్, 3,000 - 5,750 ఆర్ పీఎమ్ వద్ద 760 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్ కారు 3.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందట. ఫెరారీ రోమా కారును ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో విడుదల చేశారు. దీని ధర మన దేశంలో రూ.3.76 కోట్లు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
    Published by:Prabhakar Vaddi
    First published: