ఊపిరితిత్తుల క్యాన్సర్ (Cancer) కు ప్రధాన కారణం ధూమపానం అనే విషయం తెలిసిందే. అయితే మొత్తం బాధితుల్లో పొగతాగే అలవాటు లేని వారు 10- 20 శాతం వరకు ఉంటున్నారు. ఇలాంటి వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు(Lung Cancer) కారణమయ్యే అంశాలను గుర్తించారు పరిశోధకులు. వీరిలో బయటపడుతున్న క్యాన్సర్ కణితుల్లో ఎక్కువ భాగం.. శరీరంలో సహజ ప్రక్రియల వల్ల ఉత్పరివర్తనలు చెందడంతో ఉత్పన్నమవుతాయని కనుగొన్నారు. US నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (NCI) పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)లో భాగంగా ఉంటుంది. ఈ అధ్యయనం ఫలితాలను సోమవారం నేచర్ జెనెటిక్స్ జర్నల్‌లో ప్రచురించారు.
Viral: ఇదేం పిచ్చిరా బాబూ..! నోకియా 3310 ఫోన్‌ను మింగిన వ్యక్తి.. తరువాత ఏమైందంటే..
ధూమపానం చేయని వ్యక్తులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ మూడు మాలిక్యులర్ సబ్‌టైప్స్ గురించి ఈ పరిశోధన వివరించింది. పొగతాగే అలవాటు లేని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎలా ఉత్పన్నమవుతుందనే వివరాలను తెలుసుకోవడానికి తమ అధ్యయనం ఉపకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. వీటి ద్వారా సమస్యకు మరింత కచ్చితమైన క్లినికల్ చికిత్సలను అభివృద్ధి చేయవచ్చని NIH తెలిపింది. జన్యు విశ్లేషణ ద్వారా పరిశోధకులు ఈ వివరాలు కనుగొన్నారు. స్మోకింగ్ అలవాటు లేకుండానే నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ బారిన పడిన మొత్తం 232 మంది వ్యక్తులపై పరిశోధన చేశారు.
Side effects of Cigarettes: సిగరెట్ తాగితే మీ కనుచూపు పోయే ప్రమాదం ఉందట.. తస్మాత్ జాగ్రత్త
ఈ రోగులు ఇంకా క్యాన్సర్‌కు చికిత్స తీసుకోలేదు. వీరిలో క్యాన్సర్ కణితి కణజాలంలో జన్యుపరమైన మార్పులను వర్గీకరించడానికి మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‌ను (whole-genome sequencing) ఉపయోగించారు. వీటిని బాధితుల సాధారణ కణజాలాలతో సరిపోల్చారు. దీని ద్వారా ఎప్పుడూ ధూమపానం చేయని క్యాన్సర్ రోగుల ట్యూమర్ జన్యువులలో ఎక్కువ భాగం.. ఎండోజెనస్ ప్రక్రియల వల్ల కలిగే నష్టానికి సంబంధించిన మ్యుటేషనల్ సిగ్నేచర్స్ (ఉత్పరివర్తనలు) ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇవి శరీరం లోపల జరిగే సహజ ప్రక్రియలు కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లో చాలామంది పొగతాగేవారు, పొగాకు ఉత్పత్తులు తీసుకునేవారే ఉంటున్నారు. కానీ మొత్తం బాధితుల్లో 10- 20 శాతం మంది ధూమపానం అలవాటు లేనివారు ఉంటున్నారు. ధూమపానం చేయనివారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ మహిళల్లో తరచుగా బయటపడుతోంది. అదికూడా ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ గుర్తించడానికి ముందే, తక్కువ వయసులోనే ఉత్పన్నమవుతోంది. తాజా పరిశోధనలతో ఇలాంటి బాధితులకు చికిత్స పద్ధతులు కనిపెట్టే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cancer, Health, Smoking habbit