Lunar Eclipse | నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం..

నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. జ్యేష్ఠ నక్షత్రంలో ఈ రోజు రాత్రి 11.15 గంటలకు ప్రారంభమై 02.34 గంటలకు ముగియనుంది.

news18-telugu
Updated: June 5, 2020, 9:24 AM IST
Lunar Eclipse | నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం..
చందమామ (ఫైల్ ఫొటో)
  • Share this:
నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. జ్యేష్ఠ నక్షత్రంలో ఈ రోజు రాత్రి 11.15 గంటలకు ప్రారంభమై 02.34 గంటలకు ముగియనుంది. మొత్తం 3 గంటల 18 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఉంబోతోంది. ఈ ఏడాది జనవరిలో ఒకసారి చంద్రగ్రహణాన్ని వీక్షించిన దేశ ప్రజలు మళ్లీ ఈ రోజు చంద్రగ్రహణాన్ని చూడబోతున్నారు. భారత్‌లో పూర్తిస్థాయి చంద్రగ్రహణం అర్థరాత్రి 12 గంటల 54 నిమిషాలకు కనిపిస్తుంది. చంద్రగ్రహణం మొదలవక ముందు చంద్రుడు భూమి పాక్షిక నీడలోకి అడుగుపెడతాడు. అందుకే దీన్ని పెనుంబ్రాల్ చంద్ర గ్రహణం అంటారు.తర్వాత భూమి వాస్తవిక ఛాయలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. ఆ సమయంలో అసలైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

చంద్ర గ్రహణం ఏర్పడుతున్నందున వృశ్చిక, కుంభ, మిధున రాశుల వారు జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతున్నారు. కాగా, ఈ రోజు వచ్చే పౌర్ణమిని మన ప్రజలు ఏరువాక పౌర్ణమి అని పిలుచుకుంటూ ఉండగా, ఆల్గోన్క్విన్ తెగలు స్ట్రాబెరీ మూన్ అని అంటారు. జూన్‌లో వచ్చే పౌర్ణమిని వసంతకాలంలో చివరి పౌర్ణమిగా భావిస్తూ ఇలా పేరు పెట్టారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 5, 2020, 9:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading