అదృష్టం అంటే అతనిదే.. 53 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న పర్సు దొరికింది.. ఎక్కడంటే..?

(Photo Courtesy: Keith Theisen facebook)

ఒక వ్యక్తి 53 ఏళ్ల క్రితం తాను పోగొట్టుకున్న విలువైన వస్తువును తిరిగి దక్కించుకున్నాడు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 • Share this:
  మనమంతా ఏదో ఒక సందర్భంలో విలువైన వస్తువులను పోగొట్టుకునే ఉంటాం. అవి తిరిగి దొరుకుతాయేమో అన్న ఆశతో వెతుకుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. రెండ్రోజులు వెతికినా దొరక్కపోతే, ఇక ఆశలు వదిలేసుకుంటాం. ఒకటి, రెండ్రోజుల క్రితం పోగొట్టుకున్న వస్తువులు దొరకడమే కష్టం. అలాంటిది ఒక వ్యక్తి 53 ఏళ్ల క్రితం తాను పోగొట్టుకున్న విలువైన వస్తువును తిరిగి దక్కించుకున్నాడు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డియోగోకు చెందిన 91 ఏళ్ల పౌల్ గ్రిశామ్ రిటైర్డ్ నౌకా వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయ్యారు. పౌల్ గ్రిశామ్ అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలో 1967 ప్రాంతంలో ఏడాది పాటు శాస్త్రవేత్తగా పనిచేశారు.

  13 నెలలు అక్కడ పనిచేసిన అనంతరం తిరిగి కాలిఫోర్నియాకు చేరుకోగానే ఆయన తన పర్సు ఎక్కడో పోగొట్టుకున్నానని గ్రహించాడు. దానిలో విలువైన పత్రాలు ఉండటంతో ఎంతగానో వెతికాడు. అయినా, లాభం లేకుండా పోయింది. ఆ పర్సులో గ్రిశామ్ నేవీ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆయన ముద్దుగా ‘ది ఐస్’ అని పిలుచుకునే ఎన్నో ప్రశంసా పత్రాలు ఉన్నాయి. అణు, జీవ రసాయన దాడులు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యల రిఫరెన్స్ కార్డు, బీర్ రేషన్ కార్డు, టాక్స్ స్టేట్మెంట్ వంటి విలువైన డాక్యుమెంట్స్ ఆ పర్సులో ఉన్నాయి.

  ఇది కూడా చదవండి: 4 సెకెండ్ల వీడియోతో ఇంటర్నెట్ లో సెన్సేషన్.. చూస్తే పగలబడి నవ్వటం ఖాయం..

  53 ఏళ్ల తర్వాత దొరికిన పర్సు..
  ఇదిలా ఉంటే, 2014లో అంటార్కిటికాలోని రాస్ ఐల్యాండ్లో ఉన్న మెక్ ముర్డో స్టేషన్ లో ఉన్న పాత భవనాలను కూల్చివేశారు. గ్రిశామ్ పోగొట్టుకున్న పర్సు, దానితో పాటు మరో వ్యక్తికి చెందిన ఓ బిల్ ఫోల్డ్ ఈ కూల్చివేతల్లో భాగంగా దొరికాయి. ఇండియానాలోని స్పిరిట్ ఆఫ్ 45 అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన బ్రూస్ మెక్ సహకారంతో స్టీఫెన్ డెకాటో, ఆయన కూతురు సారా లిండ్ బర్గ్ ఎంతో శ్రమించి గ్రీశామ్ చిరునామాను సంపాదించగలిగారు. ఈ పర్సును పోస్టు ద్వారా పంపించారు. మోక్ కీ, డెకాటొ, లిండ్ బర్గ్ గ్రిశామ్ ఆచూకీ కోసం ఎంతో శ్రమించారు. ఎన్నెన్నో గ్రూపులను ఆరా తీశారు. చివరగా నేవల్ వెదర్ సర్వీస్ అసోసియేషన్ను ఆశ్రయించారు. గ్రిశామ్ ఈ అసోసియేషన్లో సభ్యుడు కావడంతో సులభంగా ఆయన వద్దకు దీన్ని పంపించారు. 53 ఏళ్ల తర్వాత తన పర్సును తన వద్దకు చేర్చడంలో జరిగిన ప్రయత్నాలు అద్భుతమని గ్రిశామ్ చెప్పుకొచ్చారు. తన పర్సు తిరిగి చేరడం కంటే దీనితో అల్లుకున్న జ్ఞాపకాలు మరువలేనివి అని గ్రిశామ్ అన్నారు.
  Published by:Hasaan Kandula
  First published: