వాయుగుండంగా అల్పపీడనం.. చురుగ్గా మారనున్న రుతుపవనాలు

Weather Report: వాయుగుండం ప్రభావంతో కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే తీరం వెంబడి పశ్చిమ దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం కల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 2, 2019, 6:56 AM IST
వాయుగుండంగా అల్పపీడనం.. చురుగ్గా మారనున్న రుతుపవనాలు
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 2, 2019, 6:56 AM IST
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర అల్ప పీడనంగా మారింది. ప్రస్తుతం ఇది వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్‌కు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే తీరం వెంబడి పశ్చిమ దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం కల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లినవాళ్లు వెంటనే తిరిగి వచ్చేయాలని హెచ్చరించారు.

కాగా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. అయితే వాయుగుండం ప్రభావంతో రుతుపవనాలు మరింత చురుకుగా మారి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుసే అవకాశముంది. ఇదే జరిగితే వర్షపాతం శాతం మరింత మెరుగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయు గుండం నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

First published: July 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...