• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • LOYAL DOG WAITS ON BRIDGE FOR 4 DAYS AFTER WATCHING OWNER JUMP INTO RIVER NK

నదిలో దూకిన ఓనర్ కోసం నాలుగు రోజులుగా ఎదురుచూస్తున్న కుక్క...

నదిలో దూకిన ఓనర్ కోసం నాలుగు రోజులుగా ఎదురుచూస్తున్న కుక్క...

నదిలో దూకిన ఓనర్ కోసం నాలుగు రోజులుగా ఎదురుచూస్తున్న కుక్క... (credit - Youtube)

విశ్వాసానికి మారుపేరైన కుక్కలు... తమ యజమానుల కోసం ప్రాణాలర్పించేందుకు కూడా వెనకాడవు. ఇంతకీ అతను నదిలో ఎందుకు దూకాడు?

  • Share this:
    ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం కల ప్రాణి ఏదంటే కుక్కే. చిన్న బిస్కెట్ ముక్క వేసినా చాలు... దాన్ని తినే ముందు... ఎవరు వేశారా అని కుక్క చూస్తుంది. ఆ మనిషినీ, అతని వాసననూ పసిగడుతుంది. ఇక అతను జీవితంలో మళ్లీ ఎప్పుడు ఎదురైనా కుక్క గుర్తుపట్టగలదు. ఒకప్పుడు నాకు బిస్కెట్ వేశాడు అని గుర్తుతెచ్చుకొని... తోకాడిస్తాయి. ఇక యజమానుల కోసం కుక్కలు ప్రాణాలకు తెగించిన ఉదంతాలు చాలా ఉన్నాయి. తాజా ఘటన కరోనా పుట్టిన చైనాలోని వుహాన్‌లో జరిగింది. అక్కడి యాంగ్జే నదిపై ఉన్న బ్రిడ్జిపై ఓ కుక్క నాల్రోజులుగా అలాగే ఉండటాన్ని జు అనే వ్యక్తి చూశాడు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ అయ్యాయి.

    ఆ కుక్కపై జాలి పడిన జు... దాన్ని తనతో తీసుకెళ్దామని ప్రయత్నిస్తే... అది తప్పించుకుని పారిపోయింది. కాసేపటి తర్వాత మళ్లీ అక్కడికే వచ్చి కూర్చుంది. మే 30న ఆ కుక్క తన ఓనర్‌ని ఫాలో అవుతూ బ్రిడ్జిపైకి వచ్చినట్లు తెలిసింది. అది రాత్రి వేళ కావడంతో... సీసీ ఫుటేజ్‌లో ఏం జరిగిందో స్పష్టంగా తెలియట్లేదు. కుక్క యజమాని నదిలో దూకినట్లు మాత్రం అర్థమైంది. అంటే అతను సూసైడ్ చేసుకున్నాడన్నమాట. కుక్కల సంరక్షకులు ఇప్పుడు ఆ కుక్కను ఎవరికైనా దత్తత ఇస్తామని చెబుతున్నారు.

    ఇంతకు ముందు ఇలాగే వుహాన్‌లోని ఓ ఆస్పత్రి లాబీలలో ఓ ఏడేళ్ల మాంగ్రెల్ జాతి కుక్క తన ఓనర్ జియా బావో కోసం ఎదురుచూసింది. ఆయన కరోనా పాజిటివ్‌తో ఐదు రోజుల తర్వాత ఆస్పత్రిలో చనిపోయాడు. గత నెలలో ఆ కుక్కను వుహాన్ స్మాల్ యానిమల్ ప్రొటెక్షన్ అసోసియేషన్‌కి తరలించారు. ఇలా కుక్కలు... తాము నమ్మిన వారి కోసం అచెంచల విశ్వాసాన్ని చూపిస్తున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: