Home /News /trending /

LOVERS SUICIDE IN THE SIRICILLA DISTRICT SNR MDK

Siricilla: పెళ్లైన ఓ ఆంటీ బ్యాచిలర్‌ని ప్రేమించింది..కలిసి బ్రతకలేమనుకొని..ఆ పని చేసింది

(విడిపోలేక చనిపోయారు)

(విడిపోలేక చనిపోయారు)

Siricilla:ఆమెకు పెళ్లైంది భర్త ఉన్నాడు. అతనికి పెళ్లి కాలేదు తల్లిదండ్రులు ఉన్నారు. కాని ఇద్దరూ ఒకే చోట పని చేయడంతో మనసులు కలిశాయి. అందర్ని ఎదిరించి ప్రేమించుకున్నారు. కలిసి జీవితం పంచుకుందామనుకున్నారు. కాని పెద్దలు నో చెప్పడంతో ఆ విధంగా తనువు చాలించారు.

ఇంకా చదవండి ...
    (K.Veeranna,News18,Medak)
    పెళ్లైన తర్వాత భర్త కాకుండా మరో వ్యక్తిపై పుట్టే ప్రేమ ఎంతటి త్యాగానికైనా సిద్దం చేస్తుందని వాళ్లను చూస్తే కాని అర్ధం కాలేదు. కలిసి చదువుకొని ఒకేచోట ఉద్యోగాలు చేస్తున్న ఓ వివాహిత, మరో యువకుడు ప్రేమించుకున్నారు. మనసులు బాగా బైక్‌పై తిరగడం, కలిసి జీవితాన్ని పంచుకోవాలని భావించారు. ఈ విషయం రెండు కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో వాళ్ల పద్దతిని తప్పు పట్టారు. దాంతో మనస్తాపానికి గురైన జంట కలిసి బ్రతకలేమని..సమాజాన్ని, కుటుంబ పెద్దల్ని ఎదిరించి బ్రతకడం సాధ్యం కాదని తెలిసి కఠిన నిర్ణయం తీసుకున్నారు. అత్యంత విషాదంగా ముగిసిన ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజీవ్ నగర్(Rajiv Nagar)చెందిన వెంకవ్వ Venkavva దశరథం( Dasharatha)దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు గతంలో అనారోగ్యంతో సూసైడ్ చేసుకున్నాడు. చిన్నకుమారుడు 24సంవత్సరాల నామ వేణుగోపాల్(Nama Venugopal)గోపాల్‌నగర్‌(Gopalnagar)లోని ఓ ప్రైవేటు క్లినిక్‌(Private Clinic)‌లో పనిచేస్తున్నాడు. అక్కడే రిసెప్షన్‌లో ఉద్యోగం చేస్తోంది 26సంవత్సరాల మచ్చ పూజ(Macha Puja)తో వేణుగోపాల్‌కి సన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్తా ఇద్దరి మధ్య విడదీయలేని బంధంగా మారింది.

    ఆమెకు పెళ్లైంది కాని..
    వేణుగోపాల్, పూజ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఒకేచోట ఉద్యోగం చేస్తున్నారు. పూజకు నాలుగేళ్ల క్రితం మేనబావ అజయ్‌తో పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. భర్తతో పూజ సఖ్యతగా ఉండటం లేదు. దీంతో పూజకు బ్రహ్మచారిగా ఉన్నటువంటి వేణుగోపాల్‌తో సాన్నిహిత్యం మరింత బలపడింది. అందులో ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వాళ్లు కావడంతో రెండేళ్లు చిన్నవాడైన వేణుతోనే కలిసి తిరగడం మొదలుపెట్టింది. ఈ విషయం ఇరువర్గాల పెద్దలకు తెలిసిపోయింది. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదిన పూజ ఇంటి నుంచి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో భర్త 16న భర్త, కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇజచ్చారు.

    అతనికి పెళ్లి కాలేదు కాని..
    కుటుంబ సభ్యులు తాము కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలియడంతో మనస్తాపానికి గురైన జంట ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని ధర్మారం చౌరస్తా సమీపానికి బైక్ వెళ్లారు. ఓ చెట్టుకు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. పెళ్లైన ఓ మహిళ, పెళ్లి కాని యువకుడు ఇద్దరూ బలవన్మరణం చేసుకోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఎస్ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Extramarital affairs, Lovers suicide, Medak District news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు