హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video Viral: బైక్‌పై ప్రేమజంట రొమాంటిక్ రైడ్ .. వైరల్ అవుతున్న వీడియో ఇదే

Video Viral: బైక్‌పై ప్రేమజంట రొమాంటిక్ రైడ్ .. వైరల్ అవుతున్న వీడియో ఇదే

video viral(Photo:Youtube)

video viral(Photo:Youtube)

Video Viral: రాజస్థాన్‌లో బైక్‌పై ప్రేమజంట చేసిన రొమాంటిక్ డ్రైవింగ్ వీడియో సంచలనంగా మారింది. రోడ్డున వెళ్తున్న కొందరు తమ సెల్‌ఫోన్‌తో వాళ్ల ఓవర్ యాక్షన్ సీన్‌ని సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Jaisalmer, India

అమ్మాయిని బైక్‌పై కూర్చోబెట్టుకొని గాల్లో తేలిపోయే అబ్బాయిల్ని చూశాం. టూ వీలర్‌పై ప్రియురాలితో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లే వాళ్లు ఉన్నారు. రాజస్థాన్‌(Rajasthan)లో ఓ యువకుడు మరీ బరితెగించాడు. బైక్‌పై తన ముందు యువతిని కూర్చొబెట్టుకొని రొమాంటిక్ యాంగిల్‌(Romantic angle)లో బైక్ నడపటం సంచలనంగా మారింది. రోడ్డున వెళ్తున్న కొందరు తమ సెల్‌ఫోన్‌తో వాళ్ల ఓవర్ యాక్షన్ సీన్‌ని సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో వీడియో(Video) కాస్తా వైరల్‌(Viral)గా మారింది. సినిమా స్టైల్లో బైక్‌(Bike)పై విన్యాసాలు చేసిన జంటను పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. బైక్‌ని సీజ్ చేశారు రాజస్థాన్‌ పోలీసులు.

Cow Hug Day: ఇక నుంచి ఫిబ్రవరి 14 కౌ హగ్ డే .. విధిగా జరుపుకోవాలని యానిమల్ లవర్స్‌కి పిలుపు

నడిరోడ్డుపై వెకిలి వేషాలు..

కుర్రాళ్ల చేష్టలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. పబ్లిక్ ప్లేసు లేదు... పార్కు లేదు. ఎక్కడ పడితే అక్కడ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. చేతిలో బైక్ ..పక్కన ప్రియురాలు ఉంటే చాలు జనం దృష్టిలో హీరోలు కావాలని ప్రయత్నిస్తూ జీరోలుగా మారుతున్నారు. అనసవరంగా వార్తల్లోకి ఎక్కి చెడ్డ పేరును తెచ్చుకుంటున్నారు. రాజస్థాన్‌ జైసల్మేర్‌లో ఓ యువకుడు, యువతి బైక్‌పై రొమాంటిగ్ డ్రైవింగ్ వీడియో ఇప్పుడు వాళ్లకు తిప్పలు తెచ్చి పెట్టింది. ఓ యువకుడు బైక్‌ నడుపుతూ ముందు పెట్రోల్‌ ట్యాంక్‌పై తన ప్రియురాలిని కూర్చొబెట్టుకొని రయ్యూ మంటూ వెళ్లడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈవీడియోని ఓ సోషల్ మీడియా ఫాలోవర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వీడియో కాస్తా వైరల్ అయింది.

సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని..

సభ్యసమాజం చూస్తుందనే సిగ్గు కూడా లేకుండా యువతి, యువకుడు బైక్‌పై రొమాన్స్ చేసుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై వెళ్తున్న కొందరు తమ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి స్థానిక పోలీసులకు షేర్ చేశారు. పబ్లిక్ ప్లేసులో ఏంటీ న్యూసెన్స్ అంటూ కామెంట్స్ పెట్టడంతో జైసల్మేర్ పోలీసులు వీడియోలోని బైక్ నెంబర్ ఆధారంగా యువతి, యువకుడ్ని పట్టుకున్నారు. బైక్‌ని సీజ్ చేసి ఇద్దరిప కేసు నమోదు చేశారు. క్రేజ్ కోసం ఈవిధంగా ప్రవర్తించిన జంటపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

వీడియో వైరల్‌తో కేసు నమోదు..

జైసల్మేర్‌లో బైక్‌పై ఇద్దరు లవర్స్ చేసిన ఓవర్ యాక్షన్‌ వీడియో కొత్తేమి కాదు. రీసెంట్‌గా వైజాగా్లో కూడా ఓ యువజంట ఇదే తరహాలో బైక్‌లో రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. అంతకు ముందు యూపీ రాజధాని లక్నోలో ఛత్తీస్‌గడ్‌లోని బిలాయ్‌లో ఇదే విధంగా బైక్‌పై రొమాన్స్‌ చేస్తూ సినిమా స్టైల్లో జంటలు వెళ్లిన వీడియోలు ఇప్పటికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. యువత బైక్‌పై చేస్తున్న వికృత చేష్టలకు చెక్ పెట్టాలంటే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Rajasthan, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు