Wedding from Home | అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి.. ఆన్‌లైన్లో పెళ్లి...

వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చూశాం కానీ, ఇలా వెడ్డింగ్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కొత్తగా ఉందని వధూవరులు ఇద్దరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు.

news18-telugu
Updated: April 18, 2020, 7:13 PM IST
Wedding from Home | అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి.. ఆన్‌లైన్లో పెళ్లి...
ఆన్ లైన్‌లో పెళ్లి చేసుకోబోతున్న కీర్తి, సుషేన్
  • Share this:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ నెలకొంది. దీంతో ప్రజలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కొన్ని పెళ్లిళ్లు కూడా ఆగిపోయాయి. ఎక్కువమంది అతిథులను ఆహ్వానించే అవకాశం లేక కొందరు పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. ప్రయాణాలు చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో అంతా వివాహాలను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. అయితే, ఈ క్రమంలో ఓ పంజాబీ జంట మాత్రం లాక్ డౌన్‌లో కూడా ‘వెడ్డింగ్ లాక్’ అవ్వాలని నిర్ణయించింది. దీంతో ఆన్ లైన్‌లో ఒక్కటవ్వాలని తీర్మానించింది. ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ 19న వారిద్దరూ పెళ్లిపీటలు ఎక్కుతున్నారు.

వరుడు సుషేన్ దంగ్ అమెరికాకు చెందిన ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ముంబైలో నివాసం ఉంటున్నాడు. వధువు కీర్తి నారంగ్. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. వారిద్దరూ తొలిసారి ఓ ఆన్‌లైన్ వివాహ పరిచయ వేదిక ద్వారా కలుసుకున్నారు. అలా అలా పెళ్లి కుదిరింది. ఇద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు. అయితే, మధ్యలో కరోనా వచ్చింది. వైరస్ వచ్చినా వారి ప్రేమను మాత్రం దూరం చేయలేకపోయింది. ఈ ప్రేమజంట వీలైనంత త్వరగా ఒక్కటవ్వాలనే కృతనిశ్చయంతో అనుకున్న ప్రకారం ఏప్రిల్ 19న ముహూర్తం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారు.

వరుడు సుషేన్ దంగ్ ముంబై నుంచి ఆన్ లైన్‌లో జాయిన్ అవుతున్నాడు. వధువు బరేలీలోని తమ నివాసం నుంచి ఆన్ లైన్‌లో జాయిన్ అవుతుంది. పెళ్లి చేసే పండితుడు కూడా తమ ఇంటి నుంచి ఆన్ లైన్లోనే వారితో మంత్రాలు చదువుతూ ఉంటారు. అలాగే, పెళ్లికి రావాలనుకున్న అతిథులు కూడా తమ తమ ఇళ్లలోనే ఉండి వధూవరులకు ఆన్ లైన్లో అక్షింతలు వేస్తారన్నమాట.

వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చూశాం కానీ, ఇలా వెడ్డింగ్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కొత్తగా ఉందని వధూవరులు ఇద్దరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు తాము కొంచెం నిరుత్సాహపడ్డామని, ఇప్పుడు బాగా ఎగ్జయిట్ అవుతున్నామని చెప్పారు. అటు అనుకున్న ప్రకారం పెళ్లి అవుతుంది. ఇటు లాక్ డౌన్ నిబంధనలు కూడా ఉల్లంఘించినట్టు కాదు కాబట్టి అంతా ఖుషీఖుషీగా ఉన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 18, 2020, 5:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading