Home /News /trending /

LOVE AND HARMONY OVER CASTE DOWRY GROUND RULE FOR WEDDINGS IN THESE TAMIL NADU TRIBAL HAMLETS GH VB

Weddings: వారికి ప్రేమ, సామరస్యమే కట్నం.. కేవలం రూ.63 తో పెళ్లి.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కులం, కట్నం, ఆస్తిపాస్తుల ప్రతిపాదన లేకుండా ఈ రోజుల్లో పెళ్లిళ్లు జరుగుతాయా? కేవలం వధూవరుల ఇష్టాయిష్టాలు, ప్రేమ ఆధారంగా ఒక్కటయ్యే అవకాశముందా? ఇలా జరగడం చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే మన వైవాహిక వ్యవస్థలో కుల వివక్ష, వరకట్నం లాంటి కలుపు మొక్కలు మొండి వృక్షాలై పాతాళానికి కూరుకుపోయాయి. కానీ తమిళనాడులోని విల్లుపురం, కల్లాక్రుచి జిల్లాల్లో నివసించే ఆదివాసీలు మాత్రం ఇందుకు విరుద్ధం.

ఇంకా చదవండి ...
కులం, కట్నం, ఆస్తిపాస్తుల ప్రతిపాదన లేకుండా ఈ రోజుల్లో పెళ్లిళ్లు జరుగుతాయా? కేవలం వధూవరుల ఇష్టాయిష్టాలు, ప్రేమ ఆధారంగా ఒక్కటయ్యే అవకాశముందా? ఇలా జరగడం చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే మన వైవాహిక వ్యవస్థలో కుల వివక్ష, వరకట్నం లాంటి కలుపు మొక్కలు మొండి వృక్షాలై పాతాళానికి కూరుకుపోయాయి. కానీ తమిళనాడులోని విల్లుపురం, కల్లాక్రుచి జిల్లాల్లో నివసించే ఆదివాసీలు మాత్రం ఇందుకు విరుద్ధం. ఇప్పటికీ ప్రేమ, సామరస్యం ఆధారంగానే వారు పెళ్లిళ్లు నిర్వహిస్తున్నారు. ఈ జిల్లాల్లో అధికంగా ఉండే ఇరులార్, కాటునాయగన్, మలై కురువాన్ గిరిజన తెగల ప్రజలు విభిన్నమైన వివాహ సంస్కృతిని పాటిస్తున్నారు. విల్లుపురం, కల్లాక్రుచి జిల్లాల మొత్తం జనాభాలో ఈ మూడు తెగలవారే 10 శాతం ఉన్నారు.  మలై కురవన్ తెగలో వివాహ తంతు.. హిందూ ఆచారాల్లో ఉండే అగ్ని ప్రదక్షిణలు మాకు ఉండవని చెబుతున్నారు కల్లాకుచ్చిలోని కుతిరాయిచండల్ గ్రామానికి చెందిన మలై కురవన్ ప్రతినిధిని తీర్థగిరి(48). ‘మా వివాహ సంస్కృతి చాలా సాధారణంగా ఉంటుంది. దంపతులు భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు కరచాలనం చేసుకొని పరస్పర ఒప్పందంతో పెళ్లి పూర్తవుతుంది. అనంతరం వధూవరులు ఒకే ఇంట్లో నివసించవచ్చు.

కట్నం ఊసే ఉండదు. ఎందుకంటే మేము వధువును ఇస్తున్నట్లు అనుకోం. బదులుగా వరుడు కుటుంబాన్ని మాలోకి స్వాగతిస్తున్నట్లు భావిస్తాం’ అని తీర్థగిరి తెలిపారు. ఈ తెగలో 9 తమలపాకులు, 9 వక్కలు, రూ.35ల చిల్లర ఇచ్చి వివాహ ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. స్థానిక భాషలో దీన్ని '18 వేరాని' గా పిలుస్తారు. ఒక వేరాని రూ.3.50 తో సమానం. ఈ లెక్కన ఈ కార్యక్రమానికి మొత్తం రూ.63 మాత్రమే ఉపయోగిస్తారు. ఇందులో రూ.35 వివాహ ఒప్పందంలో వినియోగిస్తారు. మిగిలిన సొమ్ము వరుడి కుటుంబానికి రాయితీగా ఇస్తారు. ఎందుకంటే వధువు ఈ సొమ్మును వారసత్వపు పరిహారంగా భావిస్తుంది.

ఇరులార్ తెగలో పెళ్లిళ్లు..
ఇరులార్ తెగలో కొద్దిపాటి ఆచారాలతోనే వివాహాలు జరుగుతాయి. తెగలోని పెద్ద వ్యక్తి.. వివాహ జంటను సంప్రదాయ/స్థానిక దేవత ముందు ఉంచి కట్నం ప్రతిపాదన లేకుండానే వారి పెళ్లి జరిపిస్తాడు. "మా కుటుంబాల్లో దంపతుల మధ్య బంధం గురించి పెద్దగా ఆందోళన చెందం. ఎక్కువగా ఇది ప్రేమ వివాహమే అయి ఉంటుంది. ఎందుకంటే ప్రేమ వికసించినప్పుడే భార్యభర్తలుగా కలకాలం జీవించవచ్చని మేము నమ్ముతాం. మేము కులాంతర ప్రేమకు వ్యతిరేకం కాదు. పరువు హత్యల గురించి మాకు తెలియదు" అని ఇరులార్ తెగకు చెందిన మారి అనే ఉపాధ్యాయుడు చెప్పారు.

కాటునాయకన్ తెగలో వివాహ సంస్కృతి..
కాటునాయకన్ తెగలో వివాహాలు ఇరు కుటుంబాలు పాటలు పాడటం ద్వారా నిర్వహిస్తారు. అందువల్ల వీరి కళ్యాణ మహోత్సవం కలర్ ఫుల్‌గా ఉంటుంది. ఇరు కుటుంబాల వివాహ ఒప్పందాన్ని పాట సాహిత్యం ద్వారా రూపొందిస్తాయి. ఎదుటి కుటుంబం చరిత్ర, వధువు లేదా వరుడు ఎలా పెరిగారు, ఆహారం, కళలు, వేట, కుటుంబ పద్ధతులను పాట ద్వారా వినిపించడంతో ప్రారంభమవుతుంది. అనంతరం ఇరు కుటుంబాలు వివాహంతో జంట ఒక్కటవ్వడానికి అంగీకరిస్తాయి. కుటుంబ సభ్యులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ, మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటారు. ఈ మూడు తెగల్లోనూ భాగస్వామిని ఎంచుకోవడానికి ఎలాంటి కఠినమైన పరిమితులు లేవు. గిరిజన సంఘాలు, కులాంతర వివాహాలను బహిరంగంగా అంగీకరిస్తాయి. వరకట్నం తీసుకొచ్చే పద్ధతిని తిరస్కరించాయి. అయితే ఇటీవల కాలంలో సమాజంలోని ఇతర వర్గాల ప్రభావం వీరి సంస్కృతిలో చిచ్చులు పెడుతోంది.
Published by:Veera Babu
First published:

Tags: Dowry, Love, Tamilanadu, Tribal huts

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు