ఈ మధ్య కాలంలో సమాజంలో వచ్చిన ఎన్నో మార్పులతో పాటు సామాజిక మాధ్యమాల వినియోగంలోనూ విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పొద్దుగూకులు మొఖాలను స్మార్ట్ ఫోనుల్లో ముంచేసుకునే జనాల్లో చాలా మంది ఇపుడు వారి సామాజిక మాధ్యమాల (Social Media) అకౌంట్లల్లో మాత్రం వారి నిజమైన గుర్తింపును దాచేసుకుంటున్నారంట!. ఫేస్‌బుక్ (Facebook), యూట్యూబ్ (YouTube), ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలను వినియోగిస్తున్నఎక్కువ మంది భారతీయులు ఇలా తమ గుర్తింపును గుప్తంగా ఉంచుకోవడానికే ఇష్టపడుతున్నారని అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయిన కాస్పర్‌స్కై విడుదల చేసిన సర్వే రిపోర్టులు చెబుతున్నాయి.
ఇటీవల కాలంలో భారతీయులు వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల్లో ఈ పరిస్తితి అధికంగా కనిపిస్తోంది. నానాటికీ పెరిగిపోతున్న ఈ వాతావరణానికి ప్రధాన కారణం కూడా లేకపోలేదు. వారి అసలు పేర్లు, ఫొటోలు, వ్యక్తిగత గుర్తింపు సమాచారం (పిఐఐ) వంటివి బయటపెట్టకుండా ఉంటున్న ఇలాంటి వారు అడ్డుఅదుపూ లేకుండా మాట్లాడటానికి, అలాగే హాని కలుగజేసే కార్యకలాపాలు నిర్వహించడానికే ఇలా చేస్తున్నట్లు గత శనివారం విడుదలైన ఈ తాజా రిపోర్టు హెచ్చరిస్తోంది.
మరో విస్తుగొలిపే విషయం ఏమంటే ఈ వేదికలను వినియోగిస్తున్న ఎక్కువమంది భారతీయుల్లో తమ అసలు గుర్తింపును కనపడనీయని వారు, ఫేస్‌బుక్‌లో 76 శాతం, యూట్యూబ్‌లో 60 శాతం, ఇన్‌స్టాగ్రామ్‌లో 47 శాతం, ట్విట్టర్‌లో 28 శాతం మంది ఉన్నారు. ఈ లెక్కలు గ్లోబల్ సైబర్ సెక్యురిటీ కంపెనీ అయిన కాస్పర్‌స్కై విడుదల చేసిన రిపోర్టు స్పష్టం చేసింది.
ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసినపుడు ఎంతో కోపం కలగటమే కాదు ప్రశాంతత లోపిస్తుంది. నిజానికి, ఇలా పేరు లేకుండా, మొఖం కనిపించకుండా ఉన్న సామాజిక మాధ్యమాల ప్రొఫైళ్ల వినియోగం రెండు వైపులా దాగున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ రిపోర్టులో వెల్లడైన ఫలితాలను బట్టి ఇప్పటి వరకూ ఉన్న ముసుగు తొలగింది. వ్యక్తులు వారికున్న కోరికలను తీర్చుకోవడానికి చేస్తున్న అసలు ప్రయత్నం అర్థమవుతోంది. అలాగే మరోవైపు హద్దూ అదుపూ లేకుండా మాట్లాడటం (malicious) , అదే సమయంలో హాని కలిగించే కార్యకలాపాలు (harmful activities) నిర్వహించడం వంటివి నిస్సిగ్గుగా పాటిస్తున్నారు.
కాస్పర్‌స్కై కంపెనీ, దక్షిణ ఆసియా జనరల్ మేనేజర్‌గా ఉన్న దీపేష్ కౌరా ఈ విషయంపై మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాలు ఏర్పడిన ప్రధాన కారణం స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులను కోనసాగించడం కోసం. ఇలా అపూర్వమైన ఫలితాలను అందించడానికి సామాజిక మాధ్యమం ఉద్భవించింది. భవిష్యత్తులోనూ సామాజిక మాధ్యమాల ఉనికి ఇలాగే కొనసాగుతుంది అంటారు.
నిజానికి సామాజిక మాధ్యమాలు మనం సామాజికీకరణలో భాగం కావడంలోనూ, ఒకరినొకరు గుర్తించడంలోనూ ఎంతో కీలక పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. సరిగ్గా మనం జీవితంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయం ఇది. వ్యక్తులకు మాత్రమే కాకుండా కంపెనీలకు కూడా సంబంధించిన వర్చ్యువల్ ప్రొఫైళ్లు వివిధ విషయాలపై తీర్పు తీర్చడానికి వినియోగిస్తున్నాము అంటారు కౌరా.
ఏషియా పసిఫిక్ (ఏపిఏసి) తెలిపినదాన్ని బట్టి ప్రతి పదిమందిలో దాదాపుగా ముగ్గురు వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో తమ ప్రొఫైళ్లకు వారి అసలు గుర్తింపు లేకుండా కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
సర్వే ప్రాంతంలో 1,240 మందిని కలిసి నవంబరు మాసంలో దీన్ని నిర్వహించారు. ది డిజిటల్ రెప్యుటేషన్ పరిశోధన తెలియజేసేదేమంటే, గుర్తింపు లేనితనం యొక్క ప్రభావాన్ని వినియోగించడంలో ఎక్కువగా ఆగ్నేయ ఆసియా 35 శాతంగా మొదటి స్థానంలో ఉంటే, తర్వాత 28 శాతంతో భారత దేశం, 20 శాతంతో ఆస్ర్టేలియాలు ఉన్నాయి.
ఆ సర్వేలో సగం కంటే ఎక్కువగా అంటే 59 శాతం చెప్పిన వివరాలను బట్టి, వాళ్లు ఇలా గుర్తింపు లేకుండా ఉన్న అకౌంట్లను వినియోగించడానికి గల కారణం వారి గౌరవ ప్రతిష్టలకు భగం వాటిల్లకుండా ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ( ) అనే వాక్కు హక్కును విచ్చలివిడిగా వినియోగించుకోవడానికి. ఇక 53 శాతం మంది వారి సీక్రేట్ ఇష్టాలను వారి స్నేహితులకు కనిపించకుండా, ఇతరులు వాటిని కనుగొనకుండా చేయడానికి ఇలా తమ గుర్తింపును దాచుకుంటారని తెలుస్తోంది.
ఏషియా పసిఫిక్ (ఏపిఏసి) రీజన్ లో వినియోగదారులు ఆన్‌లైన్‌లో వారు సంపాదించుకుంటున్న కీర్తి ప్రతిష్టలు, దాని వల్ల కలిగే లాభాల గురించి వారికి బాగా అర్థమయ్యింది. జీవితంలో వాటి ప్రాముఖ్యత ఎంతో వారికి అవగాహన ఉంది.
దీన్నిబట్టి, అలాగే మరో విషయం కూడా తెలుస్తోంది. ఇందులో 49 శాతం మంది వారు ఏవైనా వస్తువులు, సేవలు కొనుగోలు చేసే ముందు సామాజిక మాధ్యమాల్లో సదరు కంపెనీ, బ్రాండ్ అకౌంట్లను చెక్ చేస్తున్నారని రిపోర్టు చెబుతోంది.
వినియోగదారులు ఆన్‌లైన్‌లో కంపెనీల కీర్తి ప్రతిష్టలకు వారే బాధ్యులని ఎలా అనుకుంటున్నారో, అదేవిధంగా, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తుల ప్రవర్తనను బట్టి వారికి మార్కులు వస్తున్నాయి. ఇక్కడ ప్రవర్తన ఆధారంగానే ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్, వారికి ఉద్యోగం ఇవ్వొచ్చునో లేదో అనే విషయాలను పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, విదేశీ ప్రయాణాలకు కావాల్సిన వీసా అభ్యర్థనలో వీసా ఇవ్వాలా లేదా అనేది కూడా వారి సామాజిక మాధ్యమాల ప్రొఫైళ్లను చూసే నిర్థారిస్తున్నారని అంటారు కౌరా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Facebook, Social Media, Youtube