Home /News /trending /

LOST FAMILY DRIVES CAR RIGHT INTO CANAL AFTER FOLLOWING GOOGLE MAPS IN KERALA PAH

వామ్మో.. గూగుల్ తల్లిని గుడ్డిగా నమ్మిన ఫ్యామిలీ.. చివరకు ఎక్కడికి తీసుకెళ్లిందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kerala: కుటుంబమంతా సరదాగా కారులో వెళ్తున్నారు. తెలియని రూట్ కావడంతో గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు. అప్పుడు అనుకొని ఘటన జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India
మనలో చాలా మంది తెలియని ప్లేస్ లు, కొత్త లోకేషన్ లకు వెళ్లడానికి గూగుల్ తల్లిని నమ్ముకుంటారు. అడ్రస్ లు, లోకేషన్ లు పంపించమంటారు. ఆతర్వాత.. గూగుల్ లో లోకేషన్ ట్రాక్ చేసి.. దాన్నిపట్టుకుని వెళ్తుంటారు. అయితే.. చాలా వరకు గూగుల్ కరెక్ట్ లోకేషన్ కు తీసుకెళ్తుంది. కొన్నిసార్లు.. సాంకేతిక పొరపాట్లు లేదా అక్కడ వేరే ఇతర ప్రదేశాలు ఉంటే కాస్త అటూ ఇటూగా తీసుకెళ్తుంది. అయితే.. కొన్ని సార్లు.. గూగుల్ మ్యాప్ ను తప్పుగా చూపించిన సంఘటనలు గతంలో వైరల్ గా మారాయి. ఈ కోవకు చెందిన మరోఘటన తాజాగా, వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కేరళలో (Kerala) ఒక కుటుంబానికి అనుకొని ఘటన ఎదురైంది. కుంబనాడ్ కు చెందిన.. డాక్టర్ సోనియా, ఆమె మూడు నెలల కూతురు, తల్లి సోసమ్మ, బంధువు అనీష్ లు.. తన కారులో గురువారం ఎర్నాకులం వెళ్లారు. అయితే.. తిరిగి వస్తుండగా.. గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు. అప్పుడు.. కొట్టాయం సమీపంలోని కారచల్ వద్ద కారు ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్ (Google map) తప్పుగా చూపించింది. దాన్ని నమ్ముకుని వారు ముందుకు వెళ్లారు. అక్కడ కాలువ ఉంది. అది బురదగా నీటితో ఉండి, ప్రవహిస్తుంది. వీరి కారుకాస్త దానిలో చిక్కుకుని పోయింది.



కొంత దూరం వరకు వీరు కొట్టుకుని పోయారు. కారులో ఉన్న వీరు కాపాడాలంటూ కేకలు వేశారు. వీరిని గమనించిన చుట్టుపక్కల వారు.. సహాయక చర్యలు చేపట్టరు. రాత్రి 10 గంటల తర్వాత ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు, స్థానికులతో కలిసి.. ఒక తాడుతో కారును కట్టి సహాయక చర్యలు చేపట్టారు. తిరువాతుక్కల్‌-నాట్టకోమ్‌ సిమెంట్‌ జంక్షన్‌ బైపాస్‌ మీదుగా కుటుంబం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని కొట్టాయం పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ అనూప్‌ కృష్ణ తెలిపారు. స్థానికులు వెంటనే రంగంలోకి దిగడంతో ప్రయాణికులు మునిగిపోకముందే స్థానికులు వారిని రక్షించారు.

ఇదిలా ఉండగా బస్సు కిటీకీ నుంచి పెద్ద పులి  దాడిచేసింది.

పూర్తి వివరాలు.. అడవిలో గుండా బస్సు వెళ్తుంది. అప్పుడు డ్రైవర్ చేసిన పని ప్రస్తుతం వైరల్ గా మారింది. బస్సు డ్రైవర్ మెల్లగా కిటీకి తీశాడు. అప్పుడు కిటికీలో నుంచి ఒక పుల్లకు చికెన్ ముక్క పెట్టి పట్టుకున్నాడు. అక్కడ ఒక పులి తిరుగుతుంది. అది చికెన్ ముక్క ఉన్న పుల్లను చూసింది.

వెంటనే పరిగెత్తుకుంటు వచ్చి.. అమాంతం కిటికివైపు దూకింది. పుల్లను నోటితో పట్టుకుంది. చికెన్ ముక్కలను మంచిగా నమిలేసి మింగింది. అతను భయంతో.. దాన్ని కిటికి మూయడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) లో  వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇవే వద్దనేది .., పొరపాటున.. కిటీకిలో నుంచి పులి దూరితే పరిస్థితి ఏంటని కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Google Maps, Kerala, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు