హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : అరుదైన అద్భుతం..కళ్లు ఆర్పిన హనుమంతుడు

Viral Video : అరుదైన అద్భుతం..కళ్లు ఆర్పిన హనుమంతుడు

కళ్లు ఆర్పిన హనుమంతుడు

కళ్లు ఆర్పిన హనుమంతుడు

Hanuman Eyes Blinking Video : మధ్యప్రదేశ్(Madhyapradesh)​ రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లాలోని ఓఖ్లా గ్రామంలోని పురాతన హనుమాన్ దేవాలయం(Hanuman Temple)లో అద్భుతం జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Hanuman Eyes Blinking Video : మధ్యప్రదేశ్(Madhyapradesh)​ రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లాలోని ఓఖ్లా గ్రామంలోని పురాతన హనుమాన్ దేవాలయం(Hanuman Temple)లో అద్భుతం జరిగింది. హనుమంతుడు కళ్లు ఆర్పడం(Hanuman Eyes Blinking) కెమెరాకు చిక్కింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్(Viral Video) అవుతోంది. భక్తులు, పూజారులు దీనిని హనుమంతుడి అద్భుతంగా భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నట్లు సమాచారం.

అసలేం జరిగిందదంటే

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఉన్న ఓఖ్లేశ్వర్ ధామ్ హనుమాన్ దేవాలయం చాలా పురాతనమైనది. హనుమంతుడి ఆశీస్సుల కోసం ఈ ఆలయానికి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పురాతన, చారిత్రాత్మకమైన ఓఖ్లేశ్వర్ ధామ్ హనుమాన్ ఆలయంలో ప్రతి నెల రోహిణి నక్షత్రం 27వ రోజున స్వామివారి అలంకరణ జరుగుతుంది. అలంకరణ సమయంలో వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా రెప్పపాటులో జరిగిన ఈ అద్భుతం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా హనుమంతుడు కళ్లు ఆర్పిన ఘటన కెమెరాకు చిక్కినట్లు తెలుస్తోంది. దీనిని అక్కడే ఉన్న కొందరు భక్తులు తమ మొబైల్ ఫోన్లలో బంధించగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడు మనిషేనా : కుక్కని కారుకి కట్టి ఊరంతా పరుగెత్తించిన డాక్టర్..వీడియో వైరల్

ఇది దేవుడు చేసిన మహిమే అని భక్తులు, ఆలయ పూజారి చెబుతున్నారు. ఓఖలేశ్వర్ ధామ్‌లోని హనుమంతుడి ఆలయంలో ఇదొక్కటే కాకుండా అనేక అద్భుతాలు జరుగుతున్నాయని భక్తులు పేర్కొంటున్నారు. లయంలో భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతున్నారు. కాగా,వైరల్ అవుతున్న హనుమంతుడు కళ్లు ఆర్పిన వీడియోని న్యూస్ 18 ధృవీకరించలేదు. అయితే వీడియో వైరల్ అవడంతో మాత్రం పెద్ద ఎత్తున భక్తులు పొరుగు ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి పోటెత్తుతున్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Lord Hanuman, Madhya pradesh, Viral Video

ఉత్తమ కథలు