Video: కప్పను ఎత్తుకుపోయిన కందిరీగ... ఏనాడైనా చూశామా... కలియుగ వింత!

కప్పను ఎత్తుకుపోయిన కందిరీగ (image credit - twitter)

Video: ఈ ప్రకృతి కప్పకు ఓ ప్రత్యేక వరం ఇచ్చింది. కానీ ఆ వరమే ఆ కప్పకు శాపంగా మారింది. తనను కందిరీగ ఎత్తుకుపోతుందని ఆ కప్ప అస్సలు ఊహించలేదు. ఆ తర్వాతేమైందో వీడియోలో చూద్దాం.

  • Share this:
    Video: కప్పకు పొడవైన నాలిక ఉంటుంది. తద్వారా కప్ప ఎక్కడైనా కదలకుండా ఉంటూ... అటుగా ఏదైనా కీటకం ఎగురుతూ వస్తే... పొడవైన నాలికను... బలంగా విసురుతుంది. వెంటనే ఆ నాలికకు కీటకం అతుక్కుపోతుంది. దాంతో... కప్ప... నాలుకను వెనక్కి లాక్కొని... కీటకాన్ని గుటుక్కుమనిపిస్తుంది. ఐతే... ఈ కప్ప విషయంలో అలా జరగలేదు. కీటకమే కప్పను ఎత్తుకెళ్లింది. అసలేమైందంటే... రోజూలాగే నీటి ఒడ్డున ఆహారం కోసం ఎదురుచూస్తున్న కప్పకు... ఓ ఎగిరే కీటకం వస్తూ కనిపించింది. చూడ్డానికి అది కందిరీగలా ఉంది.

    కప్ప... నాలిక చాచి... దాన్ని క్యాచ్ చేసింది. ఐతే... కీటకం రెక్కలు ఓపెన్ గానే ఉన్నాయి. దాంతో తనను కాపాడుకునేందుకు కీటకం గట్టిగా రెక్కల్ని ఆడిస్తూ... గాల్లోకి ఎగిరేందుకు ప్రయత్నించింది. బలంగా ప్రయత్నించడంతో... కప్ప తన నాలికను వెనక్కి లాక్కోలేకపోయింది... చివరకు కీటకంతోపాటూ... కప్ప కూడా గాల్లోకి లేచిపోయింది. అలా కప్పను తనతో మోసుకుపోయింది ఆ కీటకం. బహుశా ఇలాంటి దృశ్యం మనం ఎప్పుడూ చూసి ఉండం... ఇప్పుడు ఇక్కడ వీడియోలో అది చూడండి.


    ప్రకృతి ప్రేమికులకు ఈ వీడియో బాగా నచ్చుతోంది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని చాలా మంది అంటున్నారు. ఓ కీటకం తలచుకుంటే... ఎంత బలంగా ప్రయత్నించగలదో... దీని ద్వారా తెలుస్తోంది అంటున్నారు.

    ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో వింత శబ్దాలు... హడలిపోయిన ప్రజలు... ఎందుకు వస్తున్నాయి?

    చివరికి ఏమై ఉంటుంది అనేది చాలా మందిలో ఉన్న డౌట్. కప్ప నీటిలో పడిపోయి ఉంటుందని కొంత మంది అంటున్నారు. కీటకం అంత బలంగా ఎగరలేక... కాసేపటికి ఆగిపోతుందని... దాంతో.. నీటిలో పడి కప్ప... కీటకాన్ని తినేసి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ రివర్స్ ఎటాక్ వీడియో అందరికీ ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published: