Loneliest house in the world : ఐస్‌లాండ్‌కు(Iceland) దక్షిణాన ఉన్న ద్వీపంలో ఓ ఇల్లు 100ఏళ్లుగా ఖాళీగా ఉంటుంది. దీనిని ప్రపంచంలోనే ఒంటరి ఇల్లు అని పిలుస్తారు. ఇది చాలా అందమైన ప్రదేశంలో నిర్మించబడింది, కానీ ఇక్కడకు వెళ్ళడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నేటి ప్రపంచంలో ఒక వ్యక్తికి సొంత ఇల్లు నిర్మించుకోడానికి జీవితాంతం పడుతుంది. అలాంటిది ఖాళీగా ఉన్నా కూడా ఆ ఇంటిలో నివసించేందుకు ఎవరూ ముందుకు రావట్లేదంట. ఒకప్పుడు ఇది వ్యాపారవేత్తల సురక్షిత గృహంగా ఉండేదని, కానీ కొన్నాళ్లుగా ఇక్కడ ఎవరూ నివసించడం లేదని చెబుతారు. ఈ చిన్న ఇంటి చుట్టూ ఉన్న ప్రదేశం కూడా చాలా అందంగా ఉంది. ఇక్కడ అందమైన సముద్రం, పచ్చటి గడ్డి మరియు కొన్ని జంతువులు తప్ప మరెవరూ లేరు.
ఒకప్పుడు ఈ ప్రదేశం సందడిగా ఉండేది
ఈ ఇల్లు ఉన్న ప్రదేశానికి Elliðaey అని పేరు పెట్టారు. 18, 19వ శతాబ్దాల మధ్య చాలా మంది ప్రజలు ఈ ప్రదేశంలో నివసించారు. 1930 సంవత్సరంలో ఇక్కడి నుంచి వలస రావడం ప్రారంభించారు. వారు మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. క్రమంగా ప్రజలందరూ ఇక్కడి నుండి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఉన్న ఈ ఒక్క ఇల్లు తప్ప ద్వీపంలో ఏమీ మిగలలేదు. ఈ స్థలంలో స్థిరపడేందుకు ఎవరూ రాకపోవడంతో, ఆ ఇల్లు మంచి స్థితిలో ఉన్నప్పటికీ ఎవరూ నివసించక ఖాళీగా ఉంది.
ఈ ఇంటిని కోటీశ్వరుడు కట్టించాడు
ఒకప్పుడు ఈ ఇంటిని కోటీశ్వరుడు కట్టించాడని ఈ ఇంటి గురించి చెబుతారు. కొంతమంది మతపరమైన వ్యక్తులు ఇక్కడ నివసించేవారని కొందరు నమ్ముతారు, ఈ స్థలాన్ని ఐస్లాండ్ ప్రభుత్వం ప్రసిద్ధ గాయకుడు బ్జోర్క్‌కు బహుమతిగా ఇచ్చిందని కూడా చెబుతుంటారు టూర్ కంపెనీలు ఇక్కడి వాతావరణం చాలా బాగున్నందున ప్రజలను కొండపైకి ట్రిప్ చేస్తున్నప్పటికీ... వంట సామాగ్రి, ఫర్నీచర్, మంటలను వెలిగించే స్థలం మరియు అన్ని ఆధునిక అమరికలు ఈ ఇంటి లోపల ఉన్నా కూడా శాశ్వతంగా జీవించడానికి ఎవరూ ఇక్కడికి రావట్లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: House