• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • LONE PASSENGER WHO FLEW FROM INDIA TO DUBAI FEELS LIKE MAHARAJA HERE ARE FULL DETAILS BA GH

India News: మహారాజభోగం అంటే ఇదే.. విమానంలో ఒక్కడే పాసింజర్.. ఆ కిక్కే వేరప్పా..

ప్రతీకాత్మక చిత్రం

సామాజిక కార్యకర్త, వ్యాపార వేత్త అయిన ఎస్.పి.సింగ్ ఒబెరాయ్ బుధవారం అమృత్ సర్ నుంచి దుబాయ్‌కి విమానంలో వెళ్లారు. ఫ్లైట్ ప్రారంభం అయిన తర్వాత.. ఆ విమానంలో తాను ఒక్కరే ప్యాసింజర్ అని ఆయన గుర్తించారు.

  • Share this:
సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బస్సు లేదా రైలు బోగీలో మనం ఒక్కరమే ఉంటే ఎలా అనిపిస్తుంది? కొంత మంది చాలా ఆనందంగా ఫీలయితే మరికొందరు మాత్రం కాస్త భయం భయంగా గడుపుతారు. ఇలా ఒంటరిగా ప్రయాణించే అవకాశం చాలా కొద్ది మందికి మాత్రమే లభిస్తుందని చెప్పుకోవాలి. అలాంటింది.. ఇక ఫ్లైట్‌లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఫ్లైట్ మొత్తంలో ఒక్కరే ప్రయాణించే అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. దుబాయ్ కి చెందిన ఓ భారతీయ వ్యాపార వేత్తకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అమృత్ సర్ నుంచి దుబాయ్ కి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఆ వ్యక్తి మహారాజులా గమ్యాన్ని చేరుకున్నాడు. ఫ్లైట్ మొత్తంలో ఆయన ఒక్కడు మాత్రమే ప్రయాణించడం విశేషం.

సామాజిక కార్యకర్త, వ్యాపార వేత్త అయిన ఎస్.పి.సింగ్ ఒబెరాయ్ బుధవారం అమృత్ సర్ నుంచి దుబాయ్‌కి విమానంలో వెళ్లారు. ఫ్లైట్ ప్రారంభం అయిన తర్వాత.. ఆ విమానంలో తాను ఒక్కరే ప్యాసింజర్ అని ఆయన గుర్తించారు. మూడు గంటల పాటు నడిచే ఈ విమానంలో ఒంటరిగా ప్రయాణించడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని ఒబెరాయ్ తెలిపారు.

‘అమృత్ సర్ నుంచి దుబాయ్ కి బుధవారం (జూన్ 23) ఉదయం నాలుగు గంటలకు ప్రయాణం చేశాను. నా ఎయిర్ ఇండియా (AI-929)ఫ్లైట్ మొత్తంలో నేను ఒక్కడినే ఉన్నాను. ఆ ప్రయాణంలో నాకు మహారాజులాంటి ఫీలింగ్ కలిగింది’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారాయన. అంతే కాదు.. ఈ ఫ్లైట్ టికెట్‌ని తాను 750 దీర్హమ్ (సుమారు రూ.15000)కు కొన్నానని.. అంత తక్కువ మొత్తానికి ఇంత చక్కటి అనుభవం దొరికిందని చెప్పారు. ఫ్లైట్ లోని ఉద్యోగులంతా తనను ఎంతో ప్రత్యేకంగా ట్రీట్ చేశారని.. ఖాళీ ఫ్లైట్ లో తన ఫొటోలు కూడా తీశారని చెప్పుకొచ్చారు. సాధారణంగా పైలట్, ఇతర సిబ్బందితో ఫొటోలు తీసుకోవడం కుదరదు. కానీ తాను మాత్రం ఇలా ఫొటోలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన వెల్లడించడం విశేషం.

మరోసారి ఇలాంటి అవకాశమే వస్తే దాన్ని తాను ఒప్పుకోనని వెల్లడించారు. ఇలాంటి అనుభవాలు జీవితంలో ఒక్కసారి వస్తేనే అది చాలా అద్భుతంగా ఉంటుందని.. అన్ని గంటల పాటు ఒంటరిగా ప్రయాణం చేయాలంటే చాలా బోరింగ్‌గా అనిపించిందని.. ఫ్లైట్‌లోని సీట్లు, కిటికీలను లెక్కబెడుతూ టైమ్ పాస్ చేశానని చెప్పుకొచ్చారాయన.

మొదట ఈ ఫ్లైట్ ఎక్కేందుకు ఒబెరాయ్ కి అనుమతి లభించలేదట. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి చెందిన ఆఫీసర్లతో మాట్లాడించిన తర్వాత ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతిచ్చారట. ‘నా దగ్గర అన్ని రకాల ట్రావెల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. గోల్డెన్ వీసా కూడా ఉంది. ఫుల్ వాక్సినేషన్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అయితే మొదట ఒక్కరే ప్రయాణికుడని చెబుతూ ఫ్లైట్ ఎక్కేందుకు నిరాకరించినా ఏవియేషన్ మినిస్ట్రీ సహకారంతో ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక్కడినే ఉన్నాను కాబట్టి నచ్చినట్లు తిరిగేందుకు.. ఫ్లైట్ లోని అన్ని విభాగాలను చూసేందుకు నాకు అనుమతి లభించింది’ అంటూ ఆయన చెప్పారు.
Published by:Ashok Kumar Bonepalli
First published: