• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • LONDON TRANSPORT REGULATOR BANS OLA CABS IN THE CITY OVER ITS PUBLIC SAFETY CONCERNS SU

Ola Ban: భద్రతా నిబంధనల ఉల్లంఘన... అక్కడ ఓలా క్యాబ్స్ బ్యాన్

Ola Ban: భద్రతా నిబంధనల ఉల్లంఘన... అక్కడ ఓలా క్యాబ్స్ బ్యాన్

Image: Ola in UK/ Twitter

ప్రజా రవాణా భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఓలా క్యాబ్ సర్వీసెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నగరంలో ఓలా క్యాబ్‌లపై నిషేధం విధిస్తూ లండన్ ట్రాన్స్‌పోర్ట్ రెగ్యులేటర్ నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    ప్రజా రవాణా భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఓలా క్యాబ్ సర్వీసెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నగరంలో ఓలా క్యాబ్‌లపై నిషేధం విధిస్తూ లండన్ ట్రాన్స్‌పోర్ట్ రెగ్యులేటర్ నిర్ణయం తీసుకుంది. లండన్ ట్రాన్‌పోర్ట్ రెగ్యులేటర్‌గా ఉన్న ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్(టీఎఫ్‌ఎల్) ప్రమాణాలకు అనుగుణంగా పబ్లిక్ సెఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో.. లండన్‌లో సేవలను కొనసాగించడానికి ఓలా లైసెన్స్ పునరుద్దరించబడలేదు. ముఖ్యంగా డ్రైవర్లు, వాహనాల లైసెన్స్ విషయంలో ప్రమాణాలు పాటించడంలో ఓలా విఫలమైంది. ఈ నిర్ణయంపై అప్పీలుకు వెళ్లనున్నట్టు ఓలా సంస్థ తెలిపింది. ఇక, ఓలా పోటీ సంస్థగా ఉన్న ఉబెర్ మరో 18 నెలల పాటు తమ క్యాబ్ సర్వీస్‌లను కొనసాగించడానికి లైసెన్స్ పొందిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది.

    దీనిపై టీఎఫ్ఎల్ స్పందిస్తూ.. "ఓలా లైసెన్స్ సరిగా డ్రైవర్ల చేత వెయ్యి‌కి పైగా ట్రిపులను నడిపింది. తమ నిర్ణయంపై అప్పీలుకు వెళ్లేందుకు ఓలా సంస్థకు 21 రోజులు సమయం ఉంటుంది. ఈ సమయంలో వారు తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు" అని తెలిపింది. అయితే ఓలా మాత్రం డేటా బేస్‌లో సాంకేతిక లోపం వలనే ఈ సమస్య తలెత్తిందని.. సమస్యను పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నట్టు చెప్పింది. టీఎఫ్‌ఎల్ వంటి రెగ్యులేటర్ సంస్థలతో సన్నిహితంగా, పారదర్శకంగా పనిచేయడం తమ ముఖ్య సూత్రమని ఓలా యూకే ఎండీ మార్క్ రోజెండల్ తెలిపారు. ఈ సమీక్ష కాలంలో తాము టీఎఫ్‌ఎల్‌తో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. వారు లేవనెత్తిన అంశాలపై బహిరంగంగా, పారదర్శకంగా సమాధానం ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చారు. అలాగే టీఎఫ్‌ఎల్ నిర్ణయంపై అప్పీలుకు వెళుతున్నామని వెల్లడించారు. ఓలా రైడర్స్, డ్రైవర్లు ఎప్పటిలాగానే లండన్ ప్రజలకు సురక్షితమైన సేవలను అందిస్తారని హామీ ఇచ్చారు.

    ఇక, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓలా ఫిబ్రవరి 2020లో 25వేల మంది డ్రైవర్లతో లండన్‌లో కమర్షియల్ సర్వీసులను ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు ఎంతమంది ప్రయాణికులకు సేవలు అందించారనే లేక ఎన్ని ట్రిప్స్ పూర్తి చేశారనే వివరాలను మాత్రం ఓలా వెల్లడించలేదు. ఇక, కరోనా మహమ్మారి ప్రభావం కూడా ఓలా క్యాబ్ సర్వీసెస్‌‌పై భారీగానే పడింది.
    Published by:Sumanth Kanukula
    First published: