Lok Sabha Election Results 2019: మే 23న ఓట్ల లెక్కింపు...ఏర్పాట్లలో ఈసీ తలమునకలు
Lok Sabha Election Results 2019 Date | దేశంలోని 542 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును మే 23న(గురువారం) చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లలో ఎన్నికల సంఘం అధికారులు తలమునకలయ్యారు. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును సైతం అదే రోజు చేపట్టనున్నారు.
news18-telugu
Updated: May 21, 2019, 4:21 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: May 21, 2019, 4:21 PM IST
Lok Sabha Election Results 2019 | సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును ఎన్నికల కమిషన్ ఈ నెల 23న చేపట్టనుంది. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో 542 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. ఎన్నికల్లో ధన ప్రవాహం కారణంగా తమిళనాడులోని వేలూరు లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికను ఈసీ రద్దు చేసుకుంది. ఏప్రిల్ 11న మొదటి విడత పోలింగ్ ప్రారంభంకాగా...చివరి దశ(ఏడో) పోలింగ్ మే 19న నిర్వహించారు. ఏప్రిల్ 11న తొలి విడతలో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు సైతం ఎన్నికలు నిర్వహించారు. ఏపీతో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును సైతం అదే రోజు చేపట్టనున్నారు. ఓటరు దేవుళ్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. మే 23న ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లలో ఎన్నికల కమిషన్ తలమునకలయ్యింది.

ముందుగా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వీవీప్యాట్లను కూడా లెక్కిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్ నుంచి ఐదు వీవీప్యాట్లను ర్యాండమ్‌గా ఎంపిక చేసి లెక్కింపు చేపడుతారు. ప్రతి ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వీవీప్యాట్ బూత్‌లో ఈ లెక్కింపు చేపడుతారు. వీవీప్యాట్ల లెక్కింపు కారణంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించడం నాలుగైదు గంటలు ఆలస్యంకావచ్చని భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ట్రెండ్స్ ముందే వెలువడుతాయి. అధికారం ఎవరిదన్న విషయం కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత రెండు మూడు గంటల వ్యవధిలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.

బాలకృష్ణ, మోహన్ బాబులపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి.. ఇంతకీ ఏం జరిగిందంటే..
జూనియర్ ఎన్టీఆర్ ను హీరోను చేసిన నాని..
వావ్.. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మహేష్ రాజకీయ సలహాలు..
అలాంటి రాజకీయం కుదరదు : పవన్ కల్యాణ్‌పై జనసేన నేత విమర్శలు
Nagababu: సానుభూతి వల్లే జగన్ సీఎం అయ్యారు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
వైయస్ జగన్ Vs బాలకృష్ణ.. సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల వార్..
Loading...