ఐదు ఉత్తరాది రాష్ట్రాలపై మిడతల దాడి... నెక్ట్స్ తెలుగు రాష్ట్రాలే టార్గెట్... కేంద్రం దృష్టి...

సడెన్‌గా ఇండియాలోకి ఈ మిడతలేంటి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఏం చెయ్యగలవు? ఎంత నష్టం వస్తుంది? ఓ విశ్లేషణ.

news18-telugu
Updated: May 26, 2020, 11:29 AM IST
ఐదు ఉత్తరాది రాష్ట్రాలపై మిడతల దాడి... నెక్ట్స్ తెలుగు రాష్ట్రాలే టార్గెట్... కేంద్రం దృష్టి...
ఐదు ఉత్తరాది రాష్ట్రాలపై మిడతల దాడి... నెక్ట్స్ తెలుగు రాష్ట్రాలే టార్గెట్... కేంద్రం దృష్టి...
  • Share this:
వర్షాకాలంలో... సాయంత్రం వేళ ఇంట్లో లైట్ ఆన్ చెయ్యగానే... దీపపు పురుగులు పెద్ద సంఖ్యలో వస్తాయి. అదే విధంగా... ఐదు రాష్ట్రాల్లోకి కోట్ల సంఖ్యలో మిడతలు వచ్చాయి. ఒక్కసారిగా ఇళ్లు, పంటలపై పడి సర్వనాశనం చేస్తున్నాయి. ఏ వందో, వెయ్యో అయితే... పురుగు మందులు కొట్టి చంపవచ్చు. కానీ వచ్చినవి కోట్లలో ఉన్నాయి. వాటిని ఎలా వదిలించుకోవాలో రైతులకు అర్థం కావట్లేదు. లబోదిబో మంటున్నారు. తమను ప్రభుత్వాలే ఆదుకోవాలనీ, చేతికి వచ్చే పంటల్ని అవి తినేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. నిజమే... ఆ మిడతలు ఎంత డేంజరంటే... ఏదైనా పంటపై వాలాయంటే... గంటల్లోనే మొత్తం ఆరగించేస్తాయి. మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.


ఇథియోపియా, సోమాలియా లాంటి తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి ఈ మిడతలు... హిందూ మహా సముద్రాన్ని దాటి వచ్చాయంటే నమ్మగలరా. మనకంటే ముందుగా అవి పాకిస్థాన్‌పై పడ్డాయి. అసలే ఆ దేశం ఆర్థికంగా అంతతమాత్రం. మిడతలపై పోరాటానికి ఫిబ్రవరిలో ఎమర్జెన్సీ ప్రకటించింది. అక్కడ మొత్తం ఊడ్చేసిన మిడతల కన్ను భారత్‌పై పడింది.


ఇండియాలోకి రాగానే... ఇక్కడి పంటలు, పచ్చదనం చూసి... "వావ్ ఈ దేశం భలే ఉందిగా... ఇక ఇక్కడే కొన్ని నెలలపాటూ మనం ఉండేది" అనుకుంటూ తిష్టవేసాయి. రోజురోజుకూ వాటి సంఖ్యను పెంచుకుంటూ... రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో పంటల్ని కరకరలాడిస్తున్నాయి. రాజస్థాన్‌లోని 18 జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లో 12 జిల్లాల్లో పంటలు హాంఫట్ అయ్యాయి. రాజస్థాన్, గుజరాత్, హర్యానాల్లో 2.05 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంపై మిడతలు దాడి చేసినట్లు అంచనా. రాజస్థాన్‌లో 5 లక్షల హెక్టార్లలో పంటల్ని తినేశాయి.


ఇండియాకి మిడతలు రెగ్యులర్‌గా వస్తుంటాయి. కానీ ఈ స్థాయిలో 27 ఏళ్లలో ఎప్పుడూ రాలేదు. జనరల్‌గా పళ్లాలు మోగిస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తే మిడతలు పోతాయి. కానీ... ఇప్పుడొచ్చినవాటి సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల అవి ఏ శబ్దాల్నీ పట్టించుకునేలా లేవు. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి... డ్రోన్లతో పురుగు మందులు చల్లించి... మిడతల అంతు చూడాలని ఆదేశించింది. ఐతే... దేశంలో వ్యవసాయంలో డ్రోన్లను వాడటం నేరం. ఇప్పుడు మాత్రం కేంద్ర విమాన శాఖ... అనుమతి ఇచ్చింది... రాత్రి వేళ డ్రోన్లతో పురుగు మందులు చల్లనున్నారు.


ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు నెక్ట్స్ మిడతల దాడి జాబితాలో ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సి ఉంది. జులైలోగా మరిన్ని మిడతలు రావచ్చనే అంచనా ఉంది.

కొన్ని కీలక పాయింట్లు :
- గుంపులుగా వచ్చి పంటల్ని తినేయడం మిడతలకు బాగా అలవాటు. మొక్కల్ని తినేస్తాయి.
- అవి ఓ హార్మోన్ రిలీజ్ చేసి... తద్వారా గుంపుగా ఉంటాయి.
- మిడతలు లక్షలాదిగా ఒకేసారి వేగంగా ఎగరగలవు. కానీ ఒక్క మిడతకూ సమస్య రాదు.
- ఏదైనా పంటపై వాలితే... కొన్ని గంటల్లోనే మొత్తం ఆరగించేస్తాయి.
- ప్రతీ మిడతా... ఓసారి దాడి చేస్తే... దాని బరువు ఎంత ఉందో అంత తినగలదు.
- ఆఫ్రికాలో ఈ మిడతలు ఇంకా పెద్ద సైజులో ఉంటాయి. ఇండియాలో వీటి సైజు చిన్నగా ఉంటుంది.
- మిడతల్ని కంట్రోల్ చెయ్యకపోతే... అవి నెక్ట్స్ పెసరపప్పును తినేసేలా ఉన్నాయి. అదే జరిగితే రూ.8వేల కోట్ల నష్టం తప్పదు.
First published: May 26, 2020, 11:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading