హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral : టీ కోసం రైలునే ఆపేసిన డ్రైవర్..అది కూడా క్రాసింగ్ వద్ద..అదే జపాన్ లో అయ్యి ఉంటేనా

Viral : టీ కోసం రైలునే ఆపేసిన డ్రైవర్..అది కూడా క్రాసింగ్ వద్ద..అదే జపాన్ లో అయ్యి ఉంటేనా

టీ కోసం రైలు ఆపేసిన డ్రైవర్

టీ కోసం రైలు ఆపేసిన డ్రైవర్

Stoped Train To Have Tea : అయితే మన దేశంలో ఇలా ఉంటే... జ‌పాన్ లాంటి దేశంలో ట్రైన్ ఒక నిమిషం ఆల‌స్య‌మైనా జీతాల్లో కోత విధిస్తారు. ఒక్క నిమిషం ముందు బ‌య‌లు దేరినా లేక ఆల‌స్య‌మైనా అక్క‌డి ప్ర‌యాణికుల‌కు స్వ‌యంగా క్ష‌మాప‌ణ‌లు చెబుతారు.

ఇంకా చదవండి ...

Loco Pilots Stop Train For Tea :  ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మందికి చాయ్ తాగే అల‌వాటు ఉంటుంది. చాయ్ తాగ‌నిది వారికి రోజు గ‌డిచిన‌ట్టే ఉండ‌దు. కొంత మంది అయితే చాయ్ తాగకుంటే త‌ల‌నొప్పి వ‌స్తుంద‌ని,రోజులో ఏదో కోల్పోయినట్లు ఉంటుందని కూడా అంటుంటారు. ఒత్తిడిలో ఉన్నా లేదా చేసే ప‌నికి బ్రేకు ఇచ్చి టీ తాగుతుంటారు. అయితే ప్రయాణాల సయమాల్లో కూడా టీ తాగుటుండటం తెలిసిందే. రైళ్లల్లో,విమానాల్లో అయితే ప్రయాణికుల వద్దకే టీ వస్తుంది. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు అయితే టీ తాగేందుకు ఏ దాభా దగ్గరనే లేక ఏ షాపు దగ్గరనో కొద్ది సేపు బస్సు ఆగడం తెలిసిందే. అయితే టీ కోసం ట్రైన్( ఆగడం ఎప్పుడైనా చూశారా? అవును ఇది నిజమే. ఓ ట్రైన్ డ్రైవర్ టీ కోసం ఏకంగా రైలునే ఆపేశాడు. మార్గ‌మ‌ధ్య‌లో క్రాసింగ్ వ‌ద్ద ట్రైన్ ను నిలిపివేసి టీ తీసుకున్నాడు.

ఈ ఘ‌ట‌న బీహార్‌(Bihar)లోని సివాన్‌ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని ఝాన్సి నుంచి మధ్యప్రదేశ్(Madhyapradesh)గ్వాలియ‌ర్‌కు వెళ్లుతున్న మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5:27 గంటలకు బీహార్ లోని సివాన్ స్టేషన్ కు చేరుకుంది. అయితే రైలు బయల్దేరాల్సిన సమయం అయింది. కానీ టీ కోసం రైలు దిగిన వెళ్లిన గార్గు ఎక్కలేదని తెలుసుకున్న లోకో పైలట్స్..బయల్దేరాల్సిన సమయం కావడంతో రైలుని క్రాసింగ్ దగ్గరకు తీసుకెళ్లి నిలిపేశారు. అనంతం గార్డు సమీపంలో ఉన్న దుకాణం నుంచి టీ తెచ్చి ఆపై ఇంజన్ ఎక్కాడు. టీ తీసుకొచ్చి రైలు డ్రైవర్ కి ఇచ్చిన తర్వాతనే రైలు బయల్దేరింది. రైలు ఆలస్యంతో రైలులో ఉన్న‌టువంటి ప్ర‌యాణికుల‌తో పాటు రోడ్డుపై ఉన్న వాహ‌న‌దారులు కూడా ఇబ్బందుల‌ను ఎదుర్కున్నారు. క్రాసింగ్ దగ్గర రైలు ఆగిపోవడంతో ఇరు వైపులా వాహ‌నాల‌న్ని నిలిచిపోయాయి.

ALSO READ MP,MLA Missing Posters : బీజేపీ ఎంపీ,ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోస్టర్లు

ఈ ట్రాఫిక్ జామ్‌లో ఓ అంబులెన్స్ కూడా ఆగిపోయింది. ఈ విష‌యంపై ఆ స్టేష‌న్ సూప‌రింటెండెంట్ అనంత్‌కుమార్ స్పందించారు. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటో త‌న దృష్టికి వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు. ఘటనపై విచార‌ణ చేప‌డుతున్నట్లు రైల్వే అధికారులు వెల్ల‌డించారు. కొద్ది రోజుల క్రితం రాజ‌స్థాన్‌లో ఇలాంటి ఓ ఘ‌టనే చోటు చేసుకుంది. అల్వార్‌లో ఓ డ్రైవ‌ర్ క‌చోడీ కోసం లోకో ఫైలెట్ ట్రైన్ ఆపేసాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అయితే మన దేశంలో ఇలా ఉంటే... జ‌పాన్ లాంటి దేశంలో ట్రైన్ ఒక నిమిషం ఆల‌స్య‌మైనా జీతాల్లో కోత విధిస్తారు. ఒక్క నిమిషం ముందు బ‌య‌లు దేరినా లేక ఆల‌స్య‌మైనా అక్క‌డి ప్ర‌యాణికుల‌కు స్వ‌యంగా క్ష‌మాప‌ణ‌లు చెబుతారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bihar, Train

ఉత్తమ కథలు