Aadhaar: ఆధార్ లాక్ చేయాలా? ఒక్క ఎస్ఎంఎస్ చాలు

Lock Aadhaar | ఎస్ఎంఎస్‌తో లేదా UIDAI వెబ్‌సైట్‌లో వర్చువల్ ఐడీ జెనరేట్ చేయొచ్చు. అయితే మీ మొబైల్ నెంబర్ UIDAI దగ్గర రిజిస్టరై ఉంటేనే వర్చువల్ ఐడీ జనరేట్ అవుతుంది.

news18-telugu
Updated: June 1, 2019, 3:30 PM IST
Aadhaar: ఆధార్ లాక్ చేయాలా? ఒక్క ఎస్ఎంఎస్ చాలు
Aadhaar: ఆధార్ లాక్ చేయాలా? ఒక్క ఎస్ఎంఎస్ చాలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 1, 2019, 3:30 PM IST
మీ ఆధార్ నెంబర్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేసే అవకాశం కల్పిస్తోంది యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఆధార్ నెంబర్ దుర్వినియోగం అవుతుందని, ప్రజల ప్రైవసీకి ముప్పు ఉందన్న ఆందోళన పెరగడంతో ఆధార్ సంస్థ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు ఒక్కసారి మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేస్తే ఇక ఎవరూ మీ ఆధార్ నెంబర్‌ను ఉపయోగించలేరు. ఆధార్ డెమొగ్రఫిక్, బయోమెట్రిక్, ఓటీపీ లాంటి ఆథెంటికేషన్ సేవలేవీ పనిచేయవు. ఆధార్ లాక్ చేయడానికి ముందు మీరు వర్చువల్ ఐడీ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అన్‌లాక్ చేయాలంటే ఈ వర్చువల్ ఐడీ తప్పనిసరి. ఎస్ఎంఎస్‌తో లేదా UIDAI వెబ్‌సైట్‌లో వర్చువల్ ఐడీ జెనరేట్ చేయొచ్చు. అయితే మీ మొబైల్ నెంబర్ UIDAI దగ్గర రిజిస్టరై ఉంటేనే వర్చువల్ ఐడీ జనరేట్ అవుతుంది.

Read this: PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

lock aadhaar, what happens when biometrics is locked, aadhar card biometric unlock permanently, how to unlock biometric in aadhar permanently, aadhar unlock permanently, unlock aadhaar card, disable aadhar biometric lock, aadhaar card lock, లాక్ ఆధార్, అన్‌లాక్ ఆధార్, ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ ప్రైవసీ, ఆధార్ ప్రైవసీ, ఆధార్ లాక్ ఎస్ఎంఎస్
ప్రతీకాత్మక చిత్రం


Lock Aadhaar: ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ ఎలా లాక్ చేయాలో తెలుసుకోండి




GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్‌లోని చివరి 4 నెంబర్లను టైప్ చేయాలి.
ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్ 0123 4567 8910 అయితే GETOTP 8910 అని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
UIDAI నుంచి మీకు 6 అంకెల ఓటీపీ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది.
Loading...
ఆ తర్వాత LOCKUID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు, మళ్లీ స్పేస్ ఇచ్చి 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి.
ఉదాహరణకు మీకు వచ్చిన ఓటీపీ 123456 అనుకుంటే LOCKUID 8910 123456 అని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
మీ ఎస్ఎంఎస్ సక్సెస్‌ఫుల్‌గా వెళ్లిన తర్వాత మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది.
ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ నెంబర్లకు రిజిస్టర్ చేసి ఉంటే ఆధార్ నెంబర్‌లోని చివరి 8 అంకెల్ని టైప్ చేయాల్సి ఉంటుంది.

Read this: Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

lock aadhaar, what happens when biometrics is locked, aadhar card biometric unlock permanently, how to unlock biometric in aadhar permanently, aadhar unlock permanently, unlock aadhaar card, disable aadhar biometric lock, aadhaar card lock, లాక్ ఆధార్, అన్‌లాక్ ఆధార్, ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ ప్రైవసీ, ఆధార్ ప్రైవసీ, ఆధార్ లాక్ ఎస్ఎంఎస్
ప్రతీకాత్మక చిత్రం

Unlock Aadhaar: ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ ఎలా అన్‌లాక్ చేయాలో తెలుసుకోండి


GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు ముందే క్రియేట్ చేసిన వర్చువల్ ఐడీ నెంబర్‌లోని చివరి 6 అంకెల్ని టైప్ చేయాల్సి ఉంటుంది.
మీరు ఎస్ఎంఎస్ పంపిన తర్వాత మీకు 6 అంకెల ఓటీపీ ఎస్ఎంఎస్ వస్తుంది.
తర్వాత UNLOCKUID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి వర్చువల్ ఐడీలో చివరి 6 అంకెలు మళ్లీ స్పేస్ ఇచ్చి 6 అంకెల ఓటీపీ టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.
ఎస్ఎంఎస్ వెళ్లిన తర్వాత మీ ఆధార్ నెంబర్ అన్‌లాక్ అవుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది.
ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ నెంబర్లకు రిజిస్టర్ చేసి ఉంటే వర్చువల్ ఐడీలోని చివరి 10 అంకెల్ని టైప్ చేయాల్సి ఉంటుంది.

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

SBI Jobs: ఎస్‌బీఐలో 579 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

PAN Card: మీ పాన్ కార్డ్ నెంబర్ అర్థమేంటో తెలుసా?

Aadhaar: ఆధార్ కార్డు వాడట్లేదా? డీయాక్టివేట్ అయిపోతుంది

Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...
First published: June 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...