హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఈ వెంట్రుకలకు రూ.60 లక్షలు... ఎందుకంత ఖరీదో తెలుసా..?

ఈ వెంట్రుకలకు రూ.60 లక్షలు... ఎందుకంత ఖరీదో తెలుసా..?

అబ్రహం లింకన్ జుట్టు

అబ్రహం లింకన్ జుట్టు

ప్రారంభ ధరను 75,000 డాలర్లుగా నిర్దారించగా వేలంలో ఏకంగా 81,250 డాలర్లకు అమ్ముడు పోయాయి. కానీ ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని తాము ఊహించినట్టు వేలం నిర్వహించిన సంస్థ చెబుతోంది.

ఇక్కడ కనిపిస్తున్న ఈ వెంట్రుకలకు వేలంలో 81 వేల డాలర్ల (దాదాపు రూ.60 లక్షలు) ధర పలికింది. ఎందుకంటే ఇవి సామాన్యమైన వెంట్రుకలు కాదు. ఎంతోమంది సామాన్యులు రాజకీయ గురువుగా భావించే అబ్రహం లింకన్ జుట్టు ఇది. బోస్టన్‌కు చెందిన ఆర్ఆర్ సంస్థ శనివారం ఈ వెంట్రుకలను, వాటిని పంపిన టెలిగ్రామ్‌ను వేలం వేసింది. వేలంలో ఇవి సుమారు 81,000 డాలర్లకు పైనే అమ్ముడుపోయినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఐతే కొనుగోలుదారుడి గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. 1865లో లింకన్ హత్య జరిగింది. వాషింగ్టన్ డి.సి.లోని ఫోర్డ్స్ థియేటర్ వద్ద జాన్ విల్కేస్ బూత్ అనే వ్యక్తి లింకన్‌ను కాల్చి చంపాడు. మరణానంతరం లింకన్ పోస్టుమార్టం పరీక్షలో కొంత జుట్టును తొలగించారు. ఆ వెంట్రుకల పొడవు సుమారు ఐదు సెంటీమీటర్ల వరకు ఉంది. లింకన్ భార్య మేరీ టాడ్ వాటిని తన కజిన్ అయిన కెంటకీ పోస్ట్ మాస్టర్ డాక్టర్ లైమాన్ బీచర్ టాడ్‌కు సమర్పించినట్టు వేలం వేసిన ఆర్ఆర్ సంస్థ తెలిపింది. హత్యానంతరం లింకన్ మృతదేహాన్ని పరిశీలించిన వారిలో డాక్టర్ టాడ్ కూడా ఉన్నాడు.

కెంటకీలోని లెక్సింగ్టన్ పోస్ట్ ఆఫీస్లో అతని సహాయకుడు జార్జ్ కిన్నేర్.. డాక్టర్ టాడ్కు అధికారిక వార్ డిపార్ట్మెంట్ టెలిగ్రాంలో జుట్టును పంపించారు. దీన్ని ఆయన వాషింగ్టన్లో 1865 ఏప్రిల్ 14న రాత్రి 11 గంటలకు అందుకున్నాడు. ఆ రక్తపు మరకలున్న టెలిగ్రామ్, లింకన్ తల వెంట్రుకల కట్ట కలిపి ఒకేసారి వేలం వేశారు.

లింకన్ జుట్టు, టెలిగ్రామ్ ప్రామాణికతను ఆర్ ఆర్ సంస్థ ధ్రువీకరించింది. డాక్టర్ టాడ్స్ కుమారుడు, జేమ్స్ టాడ్ 1945 లో రాసిన లేఖ ప్రకారం... జుట్టు, టెలిగ్రామ్ క్లిప్పింగ్ వారి కుటుంబం అదుపులోనే ఉన్నాయని తెలిపింది. అనంతరం 1999లో వీటిని చివరిగా ఇతరులకు అమ్మినట్టు ఆ సంస్థ తెలిపింది. ఆర్ ఆర్ వేలం కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాబీ లివింగ్స్టన్ కూడా ఇదే విషయం చెప్పాడు. ప్రారంభ ధరను 75,000 డాలర్లుగా నిర్దారించగా వేలంలో ఏకంగా 81,250 డాలర్లకు అమ్ముడు పోయాయి. కానీ ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని తాము ఊహించినట్టు వేలం నిర్వహించిన సంస్థ చెబుతోంది.


రాజకీయ విభేదాల కారణంగా లింకన్ను చంపడానికి అప్పటి వార్ కార్యదర్శి ఎడ్విన్ స్టాంటన్ కుట్ర పన్నారని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు. అది నిజం కాకపోవచ్చని చెప్పేవారికి ఈ టెలిగ్రాం ఆధారంగా మారింది. అప్పట్లో స్టాంటన్ మిలటరీ సైనికుల కమ్యూనికేషన్ వ్యవస్థను గాడితప్పించారని, ప్రణాళిక ప్రకారమే ఆయన ఇలా చేశారని చాలామంది నమ్మారు. బూత్ తప్పించుకోవడానికి స్టాంటన్ ఇలా వీలు కల్పించారని కొంతమంది భావించారు. కానీ వేలం వేసిన టెలిగ్రామ్పై డిస్పాచ్ అయిన తేదీ, ఇతర వివరాలను చూస్తే కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగలేదని తెలుస్తోంది. లింకన్ హత్యకు గురైన రాత్రే దాన్ని వాషింగ్టన్‌కు పంపించారు.

First published:

Tags: America, Trending, USA, VIRAL NEWS

ఉత్తమ కథలు