Illegal Affair: పెళ్లైన మహిళతో యువకుడి వివాహేతర సంబంధం... ఆ కుర్రాడిని ఊరి జనం ఏం చేశారో చూడండి..!

ఘటనకు సంబంధించిన దృశ్యం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటకు స్థానికులు దేహశుద్ధి చేశారు. అంతేకాదు, వారిని వీధిలోకి తీసుకొచ్చి బహిరంగంగా ఇద్దరికీ చెప్పుల దండలేశారు. ఆ ఇద్దరి ముఖాలకు నల్ల రంగు పూశారు. కొందరు యువకులు చెప్పులతో వారిద్దరిని కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తికి...

  • Share this:
    ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటకు స్థానికులు దేహశుద్ధి చేశారు. అంతేకాదు, వారిని వీధిలోకి తీసుకొచ్చి బహిరంగంగా ఇద్దరికీ చెప్పుల దండలేశారు. ఆ ఇద్దరి ముఖాలకు నల్ల రంగు పూశారు. కొందరు యువకులు చెప్పులతో వారిద్దరిని కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తికి గ్రామస్తులు గుండు గీయించారు. ఈ ఘటనపై ఆగ్రా పోలీసులు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.



    పెళ్లైన మహిళతో యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గమని, సదరు సామాజిక వర్గానికి చెందిన యువకులే ఇద్దరిపై దాడి చేశారని పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
    Published by:Sambasiva Reddy
    First published: