LOCALS MARRY MINOR LOVERS IN BIHAR VIDEO GOES VIRAL SNR
Video Viral: బీహార్‌లో లవర్స్ నైట్ సీక్రెట్‌గా కలుసుకుంటే పట్టుకొని ఏం చేశారో తెలుసా
(Photo Credit:Youtube)
Video Viral: బీహార్‌లో అర్ధరాత్రి సీక్రెట్‌గా కలుసుకున్న యువతి, యువకుడికి స్థానికులు పెళ్లి చేశారు. ఏడాది నుంచి ప్రేమించుకుంటున్న విషయాన్ని గమనించి గుడిలో వివాహం జరిపించారు. వీడియో వైరల్ కావడంతో యువతి మైనర్ అని తేలింది. మైనర్కి పెళ్లి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్‌లో ఓ ప్రేమజంటకు ఊహించని సంఘటన ఎదురైంది. మైనర్లుగా ఉన్న అబ్బాయి, అమ్మాయి తరచూ కలుసుకుంటున్నారు. ఈక్రమంలోనే రెండ్రోజుల క్రితం యువతి..ప్రియుడిని కలిసేందుకు అతని ఇంటికి వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో స్థానికులు పట్టుకొని గుడికి తీసుకెళ్లి కాళీమాత దేవాలయం(Kali Temple)లో పెళ్లి చేశారు. అయితే అమ్మాయి మైనర్ అని తెలియక పెద్దలు తప్పు చేయడంతో కేసు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. బీహార్ (Bihar)లోని ముంగేర్(Munger)జిల్లా కాసిం బజార్ పోలీస్ స్టేషన్(Kasim Bazar Police Station)పరిధిలో జరిగింది. కాసిం బజార్ మోక్బిరా నివాసి జితేంద్ర కుమార్(Jitendra Kumar)కుమారుడు ఆకాష్ కుమార్(Akash Kumar)ని కలుసుకునేందుకు అతని ప్రియురాలు శుక్రవారం(Friday)ఇతని ఇంటికి వెళ్లింది. ఇంట్లో పెద్దలు ఎవరూ లేకపోవడంతో రహస్యంగా కలుసుకోవాలనుకున్నారు.
అర్దరాత్రి లగ్నం..
ప్రేమజంట రహస్యంగా కలుసుకోవడాన్ని స్థానికులు గమనించారు. ఇద్దర్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రియుడి ఇంటికి వచ్చిన యువతిని ఎవరూ ఏంటీ అని నిలదీయడంతో ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పడంతో దగ్గరలో ఉన్న కాళీ దేవాలయానికి తీసుకెళ్లి అమ్మవారి సమక్షంలో ఆకాష్ కుమార్‌తో యువతికి పెళ్లి చేశారు.
అడ్డంగా బుక్కైపోయిన ప్రేమజంట..
17సంవత్సరాల యువతితో ఆకాష్‌కుమార్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఇద్దరూ గత ఏడాది కాలంగా తరచూ రహస్యంగా కలుసుకోవడం, ప్రేమ పేరుతో క్లోజ్‌గా మాట్లాడుకోవడం, కలిసి తిరగడం వంటివి చేస్తున్నట్లుగా అబ్బాయి కుటుంబ సభ్యులు రాబట్టారు.అందుకే శుక్రవారం అర్ధరాత్రి యువకుడిని కలిసేందుకు వచ్చిన అమ్మాయిని పట్టుకొని మొకబీర కలి ప్రాంతంలో ఉన్న కాళీ దేవాలయంలో పెళ్లి జరిపించారు.
అమ్మవారి గుడిలోనే పెళ్లి..
మైనర్ బాలికకు యువకుడి తరపు బంధువులు గుడిలో పెళ్లి చేస్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వార్త వైరల్ అయింది. పెళ్లి జరిగిన విషయాన్ని తెలుసుకున్న బాలిక తండ్రి గుడిలో చేసిన పెళ్లి చెల్లదంటూ ప్రేమ పేరును అడ్డుపెట్టుకొని మైనర్‌గా ఉన్న తన కూతురికి బలవంతంగా పెళ్లి చేశారని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. అటు పెళ్లి చేసుకున్న ప్రేమజంట కూడా ఇద్దరం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని ...కలిసే జీవిస్తామని తమకు రక్షణ కల్పించమని కాసిం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మైనర్ కావడంతో పోలీస్ కేసు..
ఈ మొత్తం ఎపిసోడ్లో రెండు పోలీస్ స్టేషన్లలో రెండు కంప్లైంట్స్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. యువతి, యువకుడి ప్రేమ వ్యవహారం పక్కన పెడితే మైనర్‌కు వివాహం జరిపించడం నేరం కాబట్టి ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.