ఈ రోజుల్లో యువత తమకు నచ్చిన దస్తులను ధరిస్తూ ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఇంటర్నెట్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌గా ఉన్న ష్యాషన్ గురించి క్షణాల్లోనే తెలుసుకుంటున్నారు. ఆ స్టైల్‌కు తగ్గట్లు తమకు నచ్చిన దుస్తులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. కానీ కొన్ని దేశాల్లో కొత్త ఫ్యాషన్లు, వినూత్నంగా ఉండే దుస్తులు, పొట్టి డ్రెస్సులపై విమర్శలు సాధారణం. తాజాగా రిప్డ్ జీన్స్ గురించి ఉత్తరాఖండ్ సీఎం తీర్థ్ సింగ్ రావత్ వ్యాఖ్యలపై దుమారం కూడా రేగుతోంది. పాశ్చాత్య దేశాల్లో కూడా ఇటీవల షార్ట్ డ్రెస్‌లపై విమర్శలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక అమెరికన్ యువతి పొట్టి దుస్తులతో రోడ్లపై నడుస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది మరో మహిళ. పోలీసులు ఆ యువతిని ప్రశ్నించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు చెందిన రోవి వేడ్ అనే యువతికి ఈ అనుకోని ఘటన ఎదురైంది. తన దుస్తుల వల్ల స్థానికంగా సమస్యలు తలెత్తాయని ఆమె ఇటీవల పేర్కొంది. తన డ్రెస్‌ను అనుచితమైనదిగా భావిస్తూ పొరుగింటివారు పోలీసులను పిలిచారని తెలిపింది. పొట్టి దుస్తులు వేసుకున్నంత మాత్రాన ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని ఆమె పోలీసులకు తెలిపింది. తాను పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ దుస్తులు ధరించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేసింది.
వీడియోలో ఏముంది?
‘నేను పూర్తిగా దుస్తులు ధరించాను. ఆమె నా స్టైల్‌ని ఇష్టపడదు. నా శరీరమే ఆమెకు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయాన్ని ఆమెతో కూడా చెప్పాను. అదే అసలు సమస్య. నేను హాట్‌గా ఉండటానికి ఇష్టపడతాను. ఇలానే ఉంటాను. ఆమె ఇంకా ఏం ఆశిస్తోందో నాకు తెలీదు’ అని పోలీసులకు తెలిపింది. అనంతరం ఆ పోలీసు కూడా ‘నేను అర్థం చేసుకోగలను’ అని చెప్పినట్టు వీడియోలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను రూవీ టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ క్లిప్పింగ్‌ను 12 మిలియన్ల మంది చూశారు. కొన్ని వార్తాసంస్థలు ఈ వీడియోను పాఠకులతో పంచుకున్నాయి. ఆమె సమాధానం ఇచ్చిన తీరును నెటిజన్లు మెచ్చుకుంటూ, మద్దతు తెలుపుతున్నారు. పొట్టి దుస్తులపై ప్రజల అభిప్రాయాలు మారాలని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
యువతి వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.