ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో విచిత్రంగా భయానకరంగా ఉన్నటువంటి పక్షి ఒకటి జనావాసాల దగ్గరకు వచ్చింది. దాని ఆకారం, రంగు చూసి అందరూ రాబందు అని డిసైడ్ అయ్యారు. అయితే ఈ రాబందు (Vulture)అనే పదం ఎవరైనా నోటి మాట ద్వారా వింటమే కాని..ఖచ్చితంగా చూసిన వాళ్లు లేరు. నిజంగా రాబందు అంటే ఇలాగే ఉంటుందని గుర్తించి చెప్పే వాళ్లు లేకపోవడంతో దాన్ని పట్టుకొని జాగ్రత్తగా పోలీసు(Police)లకు అప్పగించారు. అయితే కాన్పూుర్(Kanpur)లోని ఇద్గా శ్మశాన వాటికలో ఇది ఉండగటం గమనించిన స్థానికులు పట్టుకున్నారు. ఈ రాబందు పక్షి, కోడి రూపాలను కలిపి ఉన్నట్లుగా ఉంది. అయితే భారీ రెక్కలను చూసి ఇది ఖచ్చితంగా ఇది రాబందు అని తేల్చారు.
శ్మశానంలో రాబందు తిష్ట..
చరిత్రల్లో, పురాణాల్లో రాబందు అంటే శవాల్ని పీక్కు తీనే అత్యంత భయంకరమైన పక్షులుగా చూస్తారు. అలాంటి రాబందు ఒకటి ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో స్థానికులకు చిక్కింది. ఈద్గా శ్మశాన వాటికలో ఉన్న తెల్లటి హిమాలయ రాబందును గుర్తించిన స్థానికులు పట్టుకున్నారు. అయితే ఈ రాబందుకు రెక్కలు భారీ పొడవుగా ఉన్నాయి. సుమారు 5.5అఢుగుల పొడవు ఉండటంతో పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం చేరవేశారు. శ్మశానంలో దొరికిన రాబందు వయసు కూడా వందల ఏళ్లు ఉంటుందని అనుమానిస్తున్నారు.
శవాలు పీక్కుతినే రాబందు..
వయసు రిత్యానే ఈ రాబందు పెద్ద రెక్కలతో ఎగరలేకపోవడం వల్లే ఈరకంగా జనావాసాల మధ్యకు వచ్చి దొరికిపోయిందని స్థానికులు అంటున్నారు. అయితే ఈ భయానకర పక్షిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అయితే ఈ రకం తెల్లటి హిమాలయ రాబందులు అంతరించిపోయాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. చాలా రోజులుగా ఈ రాబందుల జంట శ్మశానంలోనే తిష్టవేసినట్లుగా గుర్తించాడు ఈద్గాలో నివసిస్తున్న సఫీక్ అనే యువకుడు. ఆదివారం మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి పెద్ద పెద్దగా ఉన్న రాబందు రెక్కల ద్వారా దాన్ని పట్టుకున్నట్లుగా తెలిపారు.
వింతగా చూస్తున్న జనం..
చూడటానికి భయంకరంగా ఉన్న ఈ రాబందును పట్టుకున్న వార్త నిమిషాల వ్యవధిలో అందరికి తెలిసిపోవడంతో చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. పోలీసుల ఆధీనంలో ఉన్న రాబందును పారెస్ట్ అధికారులకు అప్పగించి ..అది ఏ ప్రాంతానికి చెందినదో..ఇలాంటివి ఎక్కడున్నాయో..కాన్పూర్‌కి ఎలా వచ్చాయో తెలుసుకున్న తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending news, Uttar pradesh, Viral Video